నవరత్నాలతో పేదల జీవితాల్లో వెలుగు

అనపర్తి: వైయస్సార్సీపీ అధినేత వై.యస్.జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాల పథకాలు పేదల జీవితాల్లో వెలుగులు నింపనున్నాయని వైయస్సార్సీపీ మండల కన్వీనర్ మల్లిడి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. అనపర్తి 11వ వార్డులో శుక్రవారం బూత్ కన్వీనర్ ఓగిరెడ్డి సత్తిరెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన నవరత్నాల ద్వారా రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. వైయస్సార్ కుటుంబంలో సభ్యులుగా చేరి, ప్రతిపక్షనేత జగన్మోహన్రెడ్డికి అండగా నిలుద్దామని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపాలన అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అక్రమాలకు చిరునామాగా మారిందన్నారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నారన్నారు. వైయస్సార్ కుటుంబ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు వైఫల్యాలను వివరించడంతో పాటు నవరత్నాల పథకాలను ప్రజలకు వివరించి సభ్యులుగా చేర్పించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఒంటిమి సూర్యప్రకాష్, పార్టీ నాయకులు మండ రామారెడ్డి, చిన్నం వీరరామారెడ్డి, కర్రి వెంకటరెడ్డి, మండ పోతారెడ్డి, కర్రి సుధాకర్రెడ్డి, తేతలి వీర్రెడ్డి, దొరారెడ్డి, చిన్నారెడ్డి, రమేష్, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పేదల సంక్షేమానికి నవరత్నాలు పథకాలు
తుని రూరల్: పేదవర్గాల ప్రజల సంక్షేమానికే వైయస్సా ర్సీపి నవరత్నాలు పథకాలను ప్రవేశపెడుతుందని వల్లూరులో ఎంపీటీసీ చేపల గున్నబ్బాయి అన్నారు. శుక్రవారం గ్రామంలో బూత్ కమిటీ సభ్యులతో కలసి ఆయన వైయస్సార్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ గున్నబ్బాయి మాట్లాడుతు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి నవరత్నాల పథకాలు ఉపయోగపడతాయన్నారు. వై.యస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి నవరత్నాలు పథకాలను అమల్లోకి వస్తాయన్నారు. ఈనెల చివరి నుంచి అన్నవస్తున్నాడు కార్యక్రమంలో జగన్మోహన్రెడ్డి ప్రజలకు వద్దకు పాదయాత్ర చేస్తు వస్తారని, పేదల కష్టాలను తెలుసుకుంటారన్నారు. వైయస్సార్ కుటుంబంలో చేరి జగనన్నకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. దాసరి వరహాలు, పేదకాపు చినతాతారావు, పెదకాపు అప్పలరాజు, చేపల కాసులు, పెదకాపు వరహాలు, బూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

రాజన్న రాజ్యం కోసం వైయస్సార్ కుటుంబంలో చేరుదాం
తుని: రాజన్న రాజ్యం కోసం వైయస్సార్ కుటుంబంలో చేరడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రజా సంక్షేమ ప్రభుత్వం కోసం నిరీక్షిస్తున్నారు. దివంగతనేత వైయస్.రాజశేఖర్రెడ్డి తనయుడు జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి తహతహలాడుతున్నారు. శుక్రవారం నియోజకవర్గంలోని తుని, తొండంగి, కోటనందూరు మండలాలు, పట్టణంలో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వైయస్సార్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలో 9,19,20 వార్డులలో పార్టీ కన్వీనర్ రేలంగి రమణాగౌడ్, జిల్లా కార్యదర్శి అనిశెట్టి సూర్యచక్రరెడ్డి ఆయా వార్డులకు చెందిన బూత్ కన్వీనర్లు ప్రచారం చేశారు. అందరికి సముచిత న్యాయం వైయస్సార్సీపీతోనే జరుగుతుందని నాయకులు అన్నారు. గడప గడపకు వెళ్లి నవరత్నాల ప్రయోజనాలను వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం ఏమేరకు అమలు చేసిందో ప్రజా బ్యాలెట్ ద్వారా మార్కులు వేయాలని కోరారు. కుటుంబ యాజమానితో కాల్ చేయించి సభ్యత్వ నమోదు చేయించారు. కౌన్సిలర్ మంతిన గోవిందరాజు, బూత్ కన్వీనర్లు వాసంశెట్టి శ్రీనివాసరావు, బుడ్డిగ దారేష్, నార్ల రత్నాజీ, విరేంద్రకుమార్, దూలం గోపి పార్టీ నాయకులు సాపిరెడ్డి శ్రీను, బోడపాటి శ్రీను, నాగం దొరబాబు, కొప్పిరెడ్డి సత్తిబాబు, షేక్ బాబ్జి, దండెం నాగు తదితరులు పాల్గొన్నారు.

నవరత్నాలతో ప్రజలకు మంచిరోజులు
మగటపల్లి(మామిడికుదురు): ప్రతి ఒక్కరికీ మంచి జరగాలన్న నిండు మనసుతో ప్రవేశ పెట్టిన నవరత్నాల ద్వారా ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని వైయస్సార్ సీపీ రాజోలు నియోజకవర్గ కో ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు పేర్కొన్నారు. మగటపల్లిలో శుక్రవారం జరిగిన వైయస్సార్ కుటుంబం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు అండగా తానున్నానని భరోసా ఇచ్చేందుకు వైయస్సార్ సీపీ అధినేత జగన్ పాదయాత్ర పేరిట ప్రజల ముందుకు రాబోతున్నారని చెప్పారు. వైయస్సార్ రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకూ రూ.50 వేల సహాయం అందుతుందన్నారు. డ్వాక్రా మహిళలకు వైయస్సార్ ఆసరా ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. పెన్షన్ మొత్తాన్ని రూ.రెండు వేలకు పెంచడం ద్వారా ఆర్థికంగా ఆసరా లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ వైయస్సార్ కుటుంబంలో సభ్యులుగా చేరడం ద్వారా ప్రయోజనం పొందాలని సూచించారు. ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచారు. వైయస్సార్ కుటుంబంలో పలువురిని సభ్యులుగా చేర్పించారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బొలిశెట్టి భగవాన్, నాయకులు బండారు కాశీ, దొమ్మేటి సత్యనారాయణ, ఎండీవై షరీఫ్, గుబ్బల నాగరాజు, వలవల పెదబాబు, యాలంగి గంగాధర్, తలపాకుల వెంకటరవితేజ, సూరిశెట్టి బాబి, బండారు జగన్, బండారు పండు, ఇందుర్తి వెంకటేశ్వరరావు, వర్ధనపు బుజ్జి, కలిగితి రామకృష్ణ, బొడ్డపల్లి వీరాస్వామి, కలిగితి నాని, కలిగితి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫొటో: 06ఆర్జడ్ఎల్86 : మగటపల్లిలో జరిగిన ‘వైఎస్సార్ కుటుంబం’లో రాజేశ్వరరావు

ధాన్యంపాలెంలో వైయస్సార్ కుటుంబం
అడ్డతీగల: అడ్డతీగల మండలం మారుమూల గ్రామపంచాయితీ కేంద్రమైన ధాన్యంపాలెంలో శుక్రవారం వైయస్సార్ కుటుంబం కార్యక్రమాన్ని వైయస్సార్సిపి నాయకులు,ప్రజాప్రతినిధులు నిర్వహించారు.ఈసందర్బంగా ఇంటింటికీ వెళ్ళి పార్టీ ప్రజాశ్రేయస్సుని దృష్టిలో ఉంచుకుని ప్రకటించిన నవరత్నాల పధకాల గురించి ప్రతి ఒక్కరికీ వివరించారు.ఈమేరకు పార్టీ నవరత్నాల పధకాల గురించి తెలియజేస్తూ ముద్రించిన కరపత్రాలు,బ్యాడ్జీలు,స్టిక్కర్లు అందజేశారు.ప్రజాసమస్యల పట్ల నిబద్దతతో పోరాడుతున్న వైయస్సార్ పార్టీకి ప్రజలంతా ఐక్యంగా మద్దతు ఇవ్వాలని కోరారు. వైయస్సార్ కుటుంబంలో భాగస్వాములు కావాలన్నారు. పలువురితో పార్టీ నిర్వహిస్తున్న నంబర్కి మిస్సుడ్ కాల్ ఇప్పించి సభ్యుత్వ నమోదు గావించారు. ఈకార్యక్రమంలో మాజీ వైఎస్ఎంపీపీ కురసంఅమ్మాజీ,ధాన్యంపాలెం సర్పంచ్ కురసంస్వర్ణలత,పార్టీ నాయకులు కురసంబాపిరాజు,నిమ్మలశ్రీనువాసరావు,కురసంస్వామిదొర,బూత్కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

అన్నివర్గాలకు సమన్యాయం
ఏలేశ్వరం: వైయస్సార్సీపీ అధినేత జగన్  అదేశాల మేరకు నిర్వహిస్తున్న వైయస్ఆర్ కుటుంబంతో అన్నివర్గాలకు సమన్యాయం జరుగుతుందని ఆపార్టీ జిల్లా కార్యనిర్వహక కార్యదర్శి అలమండ చలమయ్య అన్నారు. పట్టణపరిధిలోని అప్పన్నపాలెంలో శుక్రవారం వైయస్సార్ కుటుంబం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి పార్టీ సభ్యత్వాలు నమోదు చేసి నవరత్నాలపై అవగాహన కల్పించారు. ఈసందర్భంగా చలమయ్య మాట్లాడుతూ... పార్టీ కోఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా వైయస్సార్ కుటుంబం అన్యూహంగా ముందుకు సాగుతున్నదన్నారు. పార్టీశ్రేణులు ఇదే స్ఫూర్తితో సభ్యత్వాల నమోదు వేగవంతం చేయాలన్నారు. మహిళలు, యువకులతో పాటు అన్నివర్గాల వారు సభ్యత్వనమోదుకు ముందుకు వస్తున్నారన్నారు. మండలంలో సభ్యత్వ నమోదు మరింత వేగవంతం చేస్తామన్నారు. రాబోయే రోజుల్లో వైయస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. చంద్రబాబు అవినీతిపాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో పార్టీనాయకులు సామంతుల సూర్యకుమార్, కర్రోతు గాంధీ, కూనపురెడ్డి సీతారామ్, మహిళలు పాల్గొన్నారు.

Back to Top