జగనన్నకు పట్టం కడదాం..కష్టాలను పారదోలుదాం

రాజన్న తనయుడు , పేద ప్రజల కోసం ప్రతిపక్షంలో ఉంటూ నిరంతరం పోరాటం చేస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు గడపగడపకు వైయస్సార్ కార్యక్రమాన్నికర్నూలులో వైయస్సార్సీపీ నేతలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు.  గత ఎన్నికల్లో అధికారం కోసం 600 మోసపూరిత  హామీలిచ్చి వంచించిన చంద్రబాబు దగా పాలనను ప్రజలకు తెలియజేసేందుకు వైయస్ జగన్ సైన్యం గడపగడపలో విస్తృతంగా పర్యటిస్తోంది. ప్రతి గ్రామం, ప్రతి గడపకు వెళ్లి ప్రజా బ్యాలట్ ను ఇచ్చి ప్రజాతీర్పును కోరుతున్నారు. ఈ సందర్భంగా బాబు పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ఇంటింటా ప్రజలు వైయస్సార్సీపీ శ్రేణులకు బ్రహ్మరథం పడుతున్నారు.  అబద్ధపు హామీలతో మోసం చేశారని గ్రహించిన ప్రజలు చంద్రబాబుకు ఎప్పుడు బుద్ధి చెప్పాలా అని ఎదురు చూస్తున్నారని వైయస్సార్సీపీ నాయకులు తెలిపారు. పేద ప్రజల కష్టాలు తొలగాలంటే ఒకే ఒక్కడు రాజన్న తనయుడు జగన్ మోహన్ రెడ్డితోనే సాధ్యం అని అన్నారు. 2019 లో జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకొనే వరకు పోరాటం సాగించాలని, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు .

Back to Top