అవినీతి పాలనకు చరమగీతం పాడుదాం

గిద్దలూరు మండలం ముళ్ళపాడు గ్రామంలో నియోజకవర్గ ఇంచార్జ్ ఐవీ రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు. ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు మోసపూరిత పాలనను ప్రజలకు వివరించారు. తాగునీరు, వీధిలైట్లు, రోడ్లు తదితర సమస్యలను ప్రజలు ఐవీరెడ్డికి మొరపెట్టుకున్నారు. ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికొదిలేసి ప్రచార ఆర్భాటంతో కాలం వెళ్లదీస్తోందని ఐవీ రెడ్డి మండిపడ్డారు. అవినీతి, అక్రమాలే ధ్యేయంగా పాలన సాగిస్తున్న చంద్రబాబు సర్కార్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాబోవు ఎన్నికల్లో వైయస్ జగన్ ను ముఖ్యమంత్రిని చేసుకొని మళ్లీ వైయస్ఆర్ సువర్ణపాలన తెచ్చుకుందామని పిలుపునిచ్చారు.


తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top