రేషన్ కార్డుకూ లంచం అడుగుతున్నారు
రేషన్ కార్డు మంజూరుకు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లితే అధికారులు లంచం అడుగుతున్నారని పలువురు దళితులు కొండపి నియోజకవర్గ ఇంచార్జీ వరికూటి అశోక్‌బాబుకు విన్నవించారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా జువ్విగుంట, పాకాల గ్రామంలో ఆయన పర్యటించారు. రేషన్ కార్డు కోసం ఇప్పటికి 13సార్లు అర్జీలు పెట్టుకున్నా రేషన్‌కార్డు మంజూరు చేయడం లేదని దళితవాడకు చెందిన పలువురు అశోక్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ... రాష్ట్రంలో దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. మన జగనన్నను సీఎంను చేసుకొని కష్టాల నుంచి గట్టెక్కుదామని ప్రజలకు భరోసా కల్పించారు.
బాబూ... ఇదేం పాలన?
రాష్ట్రాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని చంద్రబాబు నమ్మించి మోసం చేశారని వైయస్సార్‌సీపీ పశ్చిమ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలతో పాటు చంద్రబాబు ఆరాచకాలను ప్రజలకు తెలియజేసేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నిరుద్యోగ భృతికి సంబంధించి యువకులు, సొంత ఇల్లు లేని నిరుపేదలు, డ్వాక్రా రుణాలు మాఫీ కాకపోవడంతో బ్యాంకు అధికారుల నుంచి సమస్యలు ఎదురవుతున్నాయని మహిళలు ఇలా ప్రతీ ఒక్కరూ తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు.
గడపగడపలో ఒకే నినాదం
కైకలూరు మండలం చింతలచెరువు, రాచపట్నం గ్రామాల్లో వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు గడపగడకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాబు చేసిన మోసాలను గడపగడపలో ఎండగట్టారు. తూ.గో.జిల్లా, పి.గన్నవరం నియోజకవర్గం, వై.కొత్తపల్లి గ్రామంలో గడప గడపలో ఒకే నినాదం వినిపిస్తోంది. జోహార్ వైయస్సార్, జై జగన్ అంటూ ప్రజలు వైయస్సార్సీపీని అక్కున చేర్చుకొని ఆదరిస్తున్నారు. పి.గన్నవరం కోఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో కొత్తపల్లిలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం కొనసాగింది.