ఆన్ లైన్ ముఖ్యమంత్రి అసమర్థత

శ్రీకాకుళం(నరసన్నపేట))ఆన్ లైన్ ముఖ్యమంత్రి అని చెప్పుకుంటున్న చంద్రబాబు ఎన్నికల హామీల అమలు విషయంలో తన అసమర్థతను చాటుకున్నారని వైయస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ధర్మాన క్రిష్ణదాస్ విమర్శించారు. పోలాకి మండలం గంగివలస గ్రామపంచాయతీ మొగివిల్లిపేట గ్రామాల్లో ధర్మాన గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించారు. పంటలు ఎండిపోతున్నా పాలకులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్ కనెక్షన్ల పంపిణీలో చేస్తున్న అన్యాయంపై పలువురు ధర్మాన ఎదుట మొరపెట్టుకున్నారు. జన్మభూమి కమిటీ సభ్యులు ప్రజలను అన్యాయంగా వేధిస్తున్నారని గ్రామస్తులు వాపోయారు.


Back to Top