గ‌డ‌ప గ‌డ‌ప‌కూ ఉత్సాహంగా..

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజ‌కవ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మాన్ని ఉత్సాహంగా చేప‌డుతున్నారు. ఈ సంద‌ర్భంగా నాయ‌కులు గ్రామాల్లో ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. ఇంటింటికి వెళ్లి ప్ర‌జాబ్యాలెట్‌ను పంపిణీ చేసి చంద్ర‌బాబు పాల‌న‌కు మార్కులు వేయిస్తున్నారు. క‌ర్నూలు జిల్లా ఎమ్మిగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలోని గోనెగండ్ల మండ‌లం చిన్న‌మ‌ర్రివీడులో పార్టీ ఇన్‌చార్జ్ ఎర్ర‌కోట జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. 
* ఆలూరు నియోజ‌క‌వ‌ర్గంలోని హోళ‌గుంద మండ‌లంలో ఎమ్మెల్యే గుమ్మ‌నూరు జ‌య‌రాం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మోసాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.
* ప్ర‌కాశం జిల్లా చీరాల నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ఆర్ సీపీ స‌మ‌న్వ‌య‌క‌ర్త య‌డం బాలాజీ ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఇంటింటా ప‌ర్య‌టించి ప్ర‌జా బ్యాలెట్ అంద‌జేశారు.
* ప్ర‌త్తిపాడు నియోజ‌క‌వ‌ర్గం ఎల్లేశ్వ‌రం మండ‌లం బాధ‌వ‌రం గ్రామంలో పార్టీ నాయ‌కులు చంద్ర‌బాబు పాల‌న‌పై మార్కులు వేయించారు. 
* కురుపాం నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే పుష్ప‌శ్రీ‌వాణి ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. గరుగుబిల్లి  మండలంలోని గొట్టివలస  పంచాయ‌తీ   లో  పుష్పశ్రీవాణి , రాష్ట్ర యువజన విభాగ  ప్రధాన కార్యదర్శి శత్రుచర్ల పరిక్షిత్ రాజు  ప్ర‌జాబ్యాలెట్ పంపిణీ చేశారు.
* శృంగవరపుకోట నియొజకవర్గం కొత్తవలస  మండలంలోని అడ్డురువానిపాలెం   గ్రామం లో పార్టీ స‌మన్వయకర్త  నెక్కల నాయుడుబాబు గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు
* చీపురుపల్లి  మండలంలోని అలజంగి గ్రామంలో విజ‌య‌న‌గ‌రం జిల్లా అధ్య‌క్షుడు బెల్లన చంద్రశేఖ‌ర్‌, మజ్జి శ్రీనివసరావు ప‌ర్య‌టించారు.


Back to Top