ఒంగోలులో గడపగడపకూ వైయస్సార్సీపీప్రకాశంః జిల్లాలో గడపగడపకూ వైయస్సార్సీపీ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా నాలుగవ రోజైన ఇవాళ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస రెడ్డి ఒంగోలులోని 47వ డివిజన్ లో గడపగడపలో పర్యటించారు. ఈసందర్భంగా మహిళలు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. 

బాబు మోసాలను, అవినీతిని ప్రజలకు వివరించారు. ఎన్నికల హామీలకు సంబంధించి ప్రజలకు కరపత్రాలను అందించి వాటినుండి సమాధానం రాబట్టారు. ఎక్కడకెళ్లినా బాబుకు ప్రజాబ్యాలెట్ లో ఒక్క మార్కు కూడా పడడం లేదు. టీడీపీ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. రేపు 6వ డివిజన్ లో గోపాల్ నగరం‍ నుండి బాలినేని గడపగడపకూ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 

వాడవాడలా వైయస్సార్సీపీకి  ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వైయస్సార్సీపీ ప్రజాప్రతినిథులు ప్రతి గడపకు వెళ్లి ప్రజాసమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. వైయస్ జగన్ అధికారంలోకి రాగానే వాటిని తప్పకుండా నెరవేరుస్తారని  వారికి భరోసానిస్తున్నారు. ప్రతి గడపలో బాబును ప్రజలు తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని నేతలు చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని వారు ఈసందర్భంగా అన్నారు.  వైయస్ జగన్ సీఎం అయితేనే తమ జీవితాలు బాగుపడుతాయని ప్రజలు విశ్వసిస్తున్నారని నేతలు పేర్కొన్నారు. 


Back to Top