మహోద్యమంలా "గడపగడపకు వైయస్‌ఆర్‌" కార్యక్రమం

– 5 నెలలుగా నిర్విరామంగా కొనసాగుతున్న కార్యక్రమం
– గ్రామగ్రామాన  ఘన స్వాగతం పలుకుతున్న ప్రజలు
– బాబు హామీలతో మోసపోయామాని జనం ఆవేదన 
– చంద్రబాబు పాలనకు సున్నా మార్కులేసిన జనం 
– వైయస్‌ఆర్‌సీపీ నేతలతో  వైయస్‌ జగన్‌ సమీక్ష

ఒక మహాయజ్ఞానికి ఐదు నెలలు నిండాయి. గడప గడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమంలో భాగంగా అలుపెరగకుండా  తిరుగుతున్న వైయస్‌ఆర్‌సీపీ నాయకుల శ్రమకు, వైయస్‌ జగన్‌ ఆశయానికి ప్రజలు హారతులు పట్టారు. సమస్యలతో అల్లాడిపోతున్న తమ పక్షాన పోరాడటానికి ముందుకొచ్చిన పార్టీ నాయకులకు అడుగడుగునా ప్రజలు సాదరంగా స్వాగతం పలుకుతున్నారు.  వక్రబుద్ధి ముఖ్యమంత్రి నిజ స్వరూపం జనానికి తెలిసొచ్చింది. మాటల్లో తప్ప చేతల్లో అభివృద్ధి చూపించలేని ఒక అసమర్థుడి పాలనపై ఏపీ ప్రజలకు  అవగాహన వచ్చింది. హామీలు ఇవ్వడమే తప్ప తీర్చే అలవాటు లేని పబ్లిసిటీ పిచ్చోడి చేష్టలకు ఆగ్రహంతో ఊగిపోతున్న జనం పచ్చపాలనను సాగనంపేందుకు సమయం కోసం ఎదురు చూస్తున్నారు.  ఓట్లేసి గెలిపించిన ప్రజలే నేడు చంద్రబాబు మోసాలకు విసిగిపోయి మాకొద్దీ తుగ్లక్‌ పాలన అని ఈసడించుకుంటున్నారు. ఇదంతా ఒక్కరోజులో ప్రజల్లో వచ్చిన మార్పు కాదు. ప్రజల్లో తీసుకొచ్చిన మార్పు.. వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్  జగన్‌ ఆశయానికి అనుగుణంగా నడుచుకుని సాధించిన అఖండ విజయం. గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమంపై ఈనెల 5,6 తేదీల్లో పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎమ్మెల్యేలు,  నియోజకవర్గ సమన్వయకర్తలతో ప్రత్యేకంగా సుదీర్ఘంగా చర్చించారు. అనుకున్న దానికంటే 92 శాతం మేర శ్రమించి టార్గెట్ రీచ్ అయ్యారు.  ఈ నేపథ్యంలో గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమంపై కథనం..

================
విశేష స్పందన
2016 జూలై 8న మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా  వైయస్ జగన్ పులివెందుల నుంచి గడపగడపకు వైయస్‌ఆర్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆనాటి నుంచి నేటి వరకు సాగిన గడపగడపకు కార్యక్రమానికి ఐదు నెలలు నిండాయి. చంద్రబాబు మోసపూరిత హామీలు, అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్న విధానంపై ప్రజలకు అవగాహన కల్పించాలని చేపట్టిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఉన్నత ఆశయంతో ప్రజలకు మేలు చేయాలని చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ ఆదరించారు. తమ పక్షాన పోరాడటానికి వస్తున్న వైయస్సార్సీపీ శ్రేణులను జనం అక్కున చేర్చుకున్నారు.  చంద్రబాబు ఎన్నికల హామీలు పక్కన పెట్టిన విధానం, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ప్రభుత్వం పేదల పట్ల వ్యవహరిస్తున్న తీరు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తూ సాగిన ఈ ఐదు నెలల మహోద్యమంలో నాయకులు, కార్యకర్తలు, వైయస్‌ఆర్‌ అభిమానులు భాగస్వాములై ముందుకు నడిపించారు. 

ప్రధాన హామీలూ నెరవేరలేదు
2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేసిన ప్రధాన వాగ్ధానాలు కూడా అమలుకు నోచుకోలేదు. చంద్రబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రచారం చేసి ఓట్లు దక్కించుకుని అధికారంలోకి వచ్చాక హామీల అమలుకు ప్రయత్నం కూడా చేయకపోవడం దురదృష్టకరం. పైగా పలు సందర్భాల్లో మేము చెప్పలేదు అని తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి ఓటేసిన జనాన్ని ఘోరంగా అవమానించారు. ఆనాడు చంద్రబాబు ప్రచారం చేసుకున్న.. అమలుకు నోచుకోని ఆరు ప్రధాన హామీలు. 

1. రైతు రుణాలను బేషరతుగా పూర్తిగా మాఫీ చేస్తాం.
2013 ఏప్రిల్‌ 27న చంద్రబాబు పాదయాత్ర ముగింపు సభలో 
2.  అధికారంలోకి రాగానే నెల రోజుల్లో బ్యాంకుల్లోని తాకట్టు...బంగారం వెనక్కు ఇప్పిస్తాం
3. డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేస్తాం
డ్వాక్రా మహిళలకు 1.5లక్షల వరకు వడ్డీ లేని రుణాలు
ఆడబిడ్డ పుట్టిన వెంటనే రూ. 25వేలు బ్యాంకులు డిపాజిట్‌ చేస్తాం. 
4. మూడు సెంట్ల స్థలంతోపాటు రూ. 1.5లక్షలతో అందరికీ ఇల్లు.
మూడుసెంట్ల స్థలంతోపాటు ఇంటి నిర్మాణానికి లక్షా యాభైవేల ఖర్చుతో ఉచితంగా అర్హులందరికీ పక్కా గృహ నిర్మాణం. 
పది సంవత్సరాలకు పైబడ్డ గృహాలకు ఒక్కొక్క ఇంటికీ 5వేలతో మరమ్మతులు చేయిస్తాం. 
5. ఇంటికో ఉద్యోగం ఇస్తాం.. అది వచ్చే వరకు నిరుద్యోగ యువతకు 2వేల నిరుద్యోగ భృతి ఇస్తాం
6. ప్రత్యేక హోదా అయిదేళ్లు కాదు.. పదేళ్లు చాలదు.. పదిహేనేళ్లు కావాలి. 
వీటితో పాటు ఇలా వందలాది వాగ్దానాలిచ్చి మోసం చేశారు. 

ప్రజా బ్యాలెట్‌తో ప్రజల్లో అవగాహన 
వైయస్‌ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు గడపగడపకు వెళ్లి ప్రజల సాదకబాధలను తెలుసుకున్నారు. ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీల అమలుపై  వందప్రశ్నలతో కూడిన ప్రజా బ్యాలెట్‌ను ఇంటింటికీ పంచారు. ఏ గడపకు వెళ్లినా సమస్యలే దర్శనమిచ్చాయి. చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయాలను చెప్పాలని, ఎన్నికల్లో ఇచ్చిన ఏయే హామీలు నెరవేరాయని మీరు అనుకుంటున్నారో చెప్పాలని కోరగా ప్రజలు బాబుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. 

వైయస్‌ఆర్‌సీపీ అండతో తిరగబడ్డ జనం 
గడపగడపకు కార్యక్రమం ద్వారా ఇంటింటికీ తిరిగి భరోసా ఇస్తుండటంతో జనాల్లో క్రమేణా అవగాహన వచ్చింది. ఎన్నికల హామీలను ఎలా తుంగలో తొక్కారో జనానికి తొందర్లోనే అర్థమైంది. ఓట్లేయించుకుని తమను మోసం చేసిన విధానంపై ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. ప్రజాబ్యాలెట్‌తో తమ ముందుకొచ్చిన వైయస్సార్సీపీ నాయకులకు టీడీపీ పాలనలో తాము పడుతున్న బాధలు ... టీడీపీ నాయకుల మాటలు నమ్మి మోసపోయిన విధానాన్ని చెప్పుకొని ప్రజలు విలపించారు.  టీడీపీ నాయకులను ప్రశ్నించే సమయం కోసం ఎదురుచూస్తున్న జనానికి మంచి అవకాశం దొరికింది. జన చైతన్య యాత్రల పేరుతో తమ ఊరికి వచ్చిన టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలను జనం నిలదీయడం మొదలు పెట్టారు. బహిరంగంగా రోడ్డుపై నిలబెట్టి కడిగేశారు. మహిళలు హామీలు ఎందుకు అమలు చేయలేదో చెప్పాలని నిలదీశారు. రాబోయే ఎన్నికల్లో మీకు ఓటేసి లేదని మొహాన్నే చెప్పేశారు.  మరికొన్ని ప్రాంతాల్లో పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది. జనచైతన్య యాత్రల పేరుతో తమ ఊరుకి వస్తే ఊరుకోమని బ్యానర్లు పెట్టి మరీ టీడీపీ నేతలను హెచ్చరించారు. మొన్నటికి మొన్న పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే మాధవనాయుడికి వ్యతిరేకంగా మహిళలంతా నినదించారు. ఆక్వాఫుడ్ పార్కు తమకొద్దని ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిన శిలాఫలకాన్ని ధ్వసం చేశారు. కడప జిల్లా బద్వేలులో ఎమ్మెల్యేను రానీయకుండా మహిళలు అడ్డుకున్నారు. విశాఖ జిల్లాలో ఓ మహిళ సెల్‌ టవర్‌ నిర్మాణాన్ని అడ్డుకోవాలని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణను గట్టిగా నిలదీసింది. ఇదంతా వైయస్‌ జగన్‌ నేతృత్వంలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బాధిత ప్రజలకు అండగా ఉంటూ భరోసా కల్పించడంతో జనంలో చైతన్యం వచ్చింది. 

Back to Top