నిర్విరామంగా గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్‌

దివంగత ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి రోజైన జూలై 8, 2016వ తేదీన ప్రారంభ‌మైన గ‌డ‌ప గ‌డ‌పకూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మం రాష్ట్ర‌వ్యాప్తంగా దిగ్విజ‌యంగా కొన‌సాగుతోంది. పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇడుపుల‌పాయ‌లో ప్రారంభించిన ఈ కార్య‌క్ర‌మం నిర్వీరామంగా సాగుతోంది. వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌లు ఈ సంద‌ర్భంగా గ్రామాల్లో ప‌ర్య‌టిస్తుండ‌గా గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లుకుతున్నారు. వారి క‌ష్టాలు తెలుసుకుంటూ, చంద్ర‌బాబు మోసాల‌ను ఎండ‌గ‌డుతూ పార్టీ రూపొందించిన ప్ర‌జాబ్యాలెట్ పంపిణీ చేస్తున్నారు.
  
- విశాఖ జిల్లా పాడేరు మండ‌లం దుమ్ము పుట్టు పంచాయ‌తీలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి పాల్గొని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు.

- విజ‌య‌న‌గ‌రం జిల్లా కురుపాం నియోజ‌క‌వ‌ర్గం కొమరడ  మండలంలోని కుంతేసు పంచాయ‌తీలో నిర్వ‌హించిన గ‌డ‌ప గ‌డ‌ప‌కూ వైయ‌స్ఆర్ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే పుష్ప‌శ్రీ‌వాణి, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర యువజన విభాగ  ప్రధాన కార్యదర్శి శత్రుచర్ల పరిక్షిత్ రాజు పాల్గొన్నారు.

- విశాఖ‌ దక్షిణ నియోజక వర్గం లో పార్టీ సమన్వయ కర్త కోలా గురువులు, జాన్ వెస్లీ ప‌ర్య‌టించి చంద్ర‌బాబు మోసాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించారు.

- నెల్లూరు జిల్లా బోగోలు మండలం అలిమడుగు పంచాయతీ లో తెల్లగుంట గ్రామంలో చేప‌ట్టిన గడప గడపకు వైయ‌స్ఆర్  కార్యక్రమంలో కావ‌లి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.

- తూర్పు గోదావ‌రి జిల్లా కాకినాడ న‌గ‌రంలోని 37వ వార్డులో పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త ముత్తా శ‌శిధ‌ర్ ప‌ర్య‌టించి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నారు. 

- చీరాల నియోజ‌క‌వ‌ర్గం వేటపాలెం మండలం నాయినిపల్లి లో నిర్వహించిన గడప గడపకు వైయస్‌ఆర్  కార్యక్రమంలో పార్టీ ఇన్‌చార్జ్ య‌డం బాలాజీ పాల్గొని ప్ర‌జాబ్యాలెట్ పంపిణీ చేశారు.  
Back to Top