టీడీపీ నేతలను ఎక్కడిక్కడ నిలదీయండి

నిధులు దోచుకుతింటున్నారు
శ్రీకాకుళం(నరసన్నపేట))తాగు నీరు లేక అల్లాడుతున్నాం, సరైన రోడ్లు లేవు, పక్కా ఇళ్లకు బిల్లులు మంజూరు కావడం లేదు. టీడీపీ పాలనలో ఏ ఒక్క పథకం తమ దరికి చేరడం లేదని మహిళలు వైయస్సార్సీపీ నేతల వద్ద వాపోయారు. వైయస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే ధర్మాన క్రిష్ణదాస్ నరసన్నపేట నియోజకవర్గంలోని జగన్నాథపురం, సూరజ్ నగర్ లలో గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి పథకంలో నిధులు దోచుకోవడమే పనిగా పెట్టుకున్న టీడీపీ నేతలను ఎక్కడిక్కడ నిలదీయాలని ధర్మాన ప్రజలకు పిలుపునిచ్చారు. 

పాలనలో పూర్తిగా విఫలం
కర్నూలు(బనగానపల్లె)) బాబు అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా ఒక్క ఇళ్లు మంజూరు కాలేదు. రుణమాఫీ కాలేదు. ఒక్క హామీ కూడా నెరవేర్చడం లేదని, దీంతో తాము ఇబ్బందులు పడుతున్నామని బనగానపల్లె మండలం జోహానపురం గ్రామస్తులు వాపోయారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్థానికంగా గడపగడపలో పర్యటించారు. ప్రజాసమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాటసాని అన్నారు. బనగానపల్లె మండలంలో టీడీపీ ఎమ్మెల్యే జనార్థన్ రెడ్డి అభివృద్ధి పనులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జనార్ధన్ రెడ్డికి డబ్బు సంపాదనపై ఉన్న ధ్యాస నియోజకవర్గ అభివృద్ధిపై లేదని విమర్శించారు. 
 
బాబుకు మీరే తగిన బుద్ది చెప్పాలి
విశాఖపట్నం(నార్త్))రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం ఇస్తామంటే నమ్మిఓట్లేశాం. కానీ, బాబు తమను నమ్మించి మోసం చేశాడని 41వ వార్డు ప్రజలు తైనాల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త తైనాల విజయకుమార్ సూర్యానగర్, గజపతినగర్, ఐటిఐ జంక్షన్ లో పర్యటించారు. టీడీపీ ఎన్నికల హామీలపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. బాబు ఎంతసేపు రాజధాని జపం చేస్తూ ప్రజా పరిపాలనను గాలికొదిలేశారని తైనాల మండిపడ్డారు. ప్రత్యేకహోదా కాకుండా ప్యాకేజీలపై దృష్టి పెట్టిన బాబుకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలన్నారు. 

Back to Top