సీఎంకు అడుగడుగునా నిరసనల పర్వం: ఆగష్టు 10, 2012

ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి అడుగడుగునా నిరసనలే ఎదురవుతున్నాయి. సీఎం మూడోరోజు కూడా ప్రజల నుంచి నిరసనలు ఎదుర్కొన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి బస చేసిన ఆర్ అండ్ బీ అతిథిగృహాన్ని సీపీఎం కార్యకర్తలు ముట్టడించారు.

పేదలకు ఇళ్లస్థలాలు, అర్హులైన వారికి ఫించన్లు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాంతో ఆందోళనకారులను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా ఇందిరమ్మ బాటలో సీఎం వెళ్లిన ప్రతిచోటా సమస్యలపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. పోలీసుల లాఠీఛార్జ్ సర్వసాధారణమైపోయింది.

Back to Top