నయవంచక పాలన

కర్నూలు(ఆళ్లగడ్డ))గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమంగా రాష్ట్రవ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగుతోంది. వైయస్సార్సీపీ శ్రేణులకు గడపగడపలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ ఇంఛార్జ్ రామలింగారెడ్డి రుద్రవరం పట్టణంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో పర్యటించారు. బాబు మోసపూరిత విధానాలను ఎండగట్టారు. ఈసందర్భంగా స్థానికులు తమ సమస్యలను రామలింగారెడ్డి వద్ద మొరపెట్టుకున్నారు.  రెండున్నరేళ్ల పాలనలో బాబు చేసింది శూన్యమని, అబద్ధపు హామీలతో వంచించిన బాబుకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


తూర్పుగోదావరి: జిల్లాలోని పి.గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో గడపగడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ కో-ఆర్డినేటర్ కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి వెళ్లి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. టీడీపీ హామీల వైఫల్యం, అవినీతిపై ప్రజలకు వివరించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. Back to Top