చంద్రబాబును తరిమికొట్టండి

చిత్తూరు(నగరి)) చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా నమ్మిన ప్రజలను సర్వనాశనం చేసి రోడ్డున పడేశాడని వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మండిపడ్డారు. గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో పర్యటించారు. ఇంటింటికీ తిరిగి బాబు మోసాలను ఎండగట్టారు. ప్రజాబ్యాలెట్ పంపిణీ చేసి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఏ గ్రామానికి వెళ్లిన చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని ప్రజలు చెబుతున్నారని రోజా తెలిపారు.  బాబు రాష్ట్రాన్ని నిట్టనిలువునా ముంచే జన్మభూమి కార్యక్రమాలు పెట్టడం బాధాకరమని రోజా విమర్శించారు.  గతంలో తీసుకున్న అర్జీలను బుట్టదాఖలు చేశారు. ఏవిధమైన సహాయం చేయకుండా మళ్లీ జన్మభూమి అంటూ చంద్రబాబును పొగిడించడమే పనిగా పెట్టుకోవడం దురదృష్టకరమని ధ్వజమెత్తారు. 

సగానికి పైగా వికలాంగులు, వృద్ధులకు పెన్షన్లు రావడం లేదు. బాబు వస్తే జాబు వస్తుందని చెప్పాడు. ఒక్క జాబు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు కలత చెందుతున్నారని రోజా పేర్కొన్నారు. చంద్రబాబు తనకు అనుకూలంగా ఉన్న మీడియాతో పబ్లిసిటీకి పెట్టే ఖర్చులో కొద్దిగానైన పేదలకు ఖర్చుపెడితే సంతోషించేవాళ్లని అన్నారు. మహానేత వైయస్ఆర్ శంకుస్థాపన చేసి ప్రారంభించిన ప్రాజెక్ట్ లకు చిల్లర్లు విదిల్చి తానే ఫినిష్ చేశానని చెప్పుకోవడం దారుణమని బాబు తీరుపై మండిపడ్డారు. ఓ సభలో స్థానిక దళిత ఎమ్మెల్యే మాట్లాడుతుండగా బాబు మైక్ కట్ చేసి ఎగతాళి చేయడాన్ని రోజా తీవ్రంగా తప్పుబట్టారు. దళితులంటే బాబుకు ఎంత చులకనో  ఐజయ్య విషయంలో మరోసారి రుజువైందని చెప్పారు. గతంలో ఎస్సీలో ఎవరు పుట్టాలని కోరుకుంటారంటారంటూ చంద్రబాబు దళితులను అవమానించిన విషయాన్ని గుర్తు చేశారు.  చంద్రబాబు లాంటి అంహకారిని, అవినీతిపరుడిని, మోసకారిని తరిమికొట్టాలని రోజా ప్రజలకు పిలుపునిచ్చారు. 
Back to Top