ఏపీని అవినీతిలో నెం.1 చేసిన ఘనత బాబుదే

నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ జనార్దన్ రెడ్డి కాలనీలో  ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గడపగడపకు వైయస్ఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...కాలనీలో తాగునీటి సమస్య ఎక్కువగా ఉందని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పేరుతో ఉన్న పైపులైన్లన్నీ తీసేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. త్వరగా మంచినీటి పైపులైన్లు వేసి ప్రజలకు తాగునీరు అందించాలని కార్పొరేషన్ అధికారులకు సూచించామన్నారు. 

ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం లేని వారికి నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్న చంద్రబాబు...అవి ఇవ్వకపోగా నావల్లే నోట్లు రద్దు అయ్యాయని చెప్పుకుంటూ ప్రతీ ఒక్కరినీ పనులు మానుకొని బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగడమే ఉద్యోగంగా మార్చాడని ఎద్దేవా చేశారు. దేశంలో ఏపీని అభివృద్ధిలో గాకుండా అవినీతిలో నంబర్.1 చేసిన ఘనత బాబుకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
Back to Top