ఒంగోలు జాతి పశుసంపదను కాపాడండి

వ్యవసాయశాఖ మంత్రులను కలిసిన వైవి సుబ్బారెడ్డి 
కృత్రిమ పిండాలు బ్రెజిల్ కు ఇవ్వొద్దని విజ్ఞప్తి
పొగాకు రైతులను ఆదుకోవాలని డిమాండ్

న్యూఢిల్లీ
: వైఎస్సార్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి కేంద్రవ్యవసాయ శాఖమంత్రి
రాధామోహన్ సింగ్, అదేవిధంగా బ్రెజిల్ వ్యవసాయ శాఖమంత్రి కైరోను
న్యూఢిల్లీలో కలిశారు. ఒంగోలు జాతి పశుసంపదను కాపాడాలని  వైవీ సుబ్బారెడ్డి
రాధామోహన్ సింగ్ కు విజ్ఞప్తి చేశారు. ఒంగోలు జాతి గిత్తల కృత్రిమ పిండాలు
బ్రెజిల్ కు ఇవ్వవద్దని రాధామోహన్ సింగ్ ను కోరినట్లు చెప్పారు.
దొడ్డిదారిలో ఒంగోలు జాతి గిత్తల కృత్రిమ పిండాలను బ్రెజిల్ తీసుకుంటుందని
ఆరోపించారు. కృత్రిమ పిండాలు ఇస్తే భారత్ తీవ్రంగా నష్టపోతుందని ఆయన ఆందోళన
వ్యక్తం చేశారు.

సంపదను వృద్ధి చేయండి..!
బ్రెజిల్
లో పశు సంపద వృద్ధికి అనుసరిస్తున్న సాంకేతిక విజ్ఞానాన్ని మనదేశానికి
తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుబ్బారెడ్డి ఈ సందర్భంగా డిమాండ్
చేశారు. దేశానికి గర్వకారణమైన ఒంగోలు జాతి పశువులను వృద్ధి చేయాలన్నారు.
పాడిపశుగణాభివృద్ధిలో బ్రెజిల్  బాగా అభివృద్ధి చెందిందని వైవి
సుబ్బారెడ్డి తెలిపారు. అక్కడి టెక్నాలజీని భారత్ కు అందించాలని బ్రెజిల్
వ్యవసాయ శాఖమంత్రి కైరోను కోరినట్లు సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 

రైతులను ఆదుకోండి..!
పొగాకు
రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసే దిశగా ప్రభుత్వం ప్రోత్సహించాలని వైవీ
సుబ్బారెడ్డి రాధామోహన్ సింగ్ ను కోరారు. ఆంధ్రప్రదేశ్ లో పొగాకు రైతుల
సమస్యలపై పలుమార్లు  ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చామని, వాళ్లకి న్యాయం
జరిగేలా చూడాలని మంత్రిని కోరినట్లు చెప్పారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 34
మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని మంత్రి దృష్టికి
తీసుకెళ్లాలన్నారు. ఇదివరకే దీనిపై ప్రధానికి లేఖ కూడా రాయడం జరిగిందని,
మళ్లీ సీజన్ ప్రారంభమవుతున్నందున ఈఘోరం పునరావృత్తం కాకుండా చూడాలని
మంత్రికి చెప్పినట్లు సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.  
Back to Top