నెలాఖరున అనంతలో యువభేరి

అనంతపురంః
రాష్ట్రాభివృద్ధి ప్రత్యేక హోదాతోనే సాధ్యమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన
కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్ కోసం
ప్రత్యేకహోదాని సాధించేందుకు వైఎస్సార్సీపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం
చేశారు. విద్యార్థిసంఘాలు, విద్యార్థుల విజ్ఞప్తి మేరకు అనంతపురంలో ఈ
నెలాఖరున యువభేరి నిర్వహిస్తున్నట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా హాజరై... విద్యార్థులు,
యువకులకు ప్రత్యేకహోదా ఆవశ్యకత గురించి దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. 

రాష్ట్రానికి
ప్రత్యేకహోదా సాధించేవరకు వివిధ రూపాల్లో వైఎస్సార్సీపీ పోరాటం
కొనసాగిస్తుందని విజయసాయిరెడ్డి తేల్చిచెప్పారు. ఇప్పటికే ఢిల్లీలో దీక్ష,
రాష్ట్ర బంద్, గుంటూరులో నిరవధిక నిరాహార దీక్షతో పాటు తిరుపతి, విశాఖలలో
యువభేరి నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. హోదా విషయంలో
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోనే
....రాష్ట్రం అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో వైఎస్ జగన్  ప్రత్యేకహోదా కోసం
పోరాటం సాగిస్తున్నారన్నారు. అనంతపురంలో యువభేరి ఏర్పాట్లను
విజయసాయిరెడ్డి పరిశీలించారు.   
Back to Top