వైయస్ స్వర్ణయుగం జగన్‌తోనే సాధ్యం

రావులపాలెం:

మహానేత వై.యస్. రాజశేఖరరెడ్డి కలలుగన్న స్వర్ణయుగం జగన్ ద్వారానే సాధ్యమని మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పేర్కొన్నారు. ఈ విషయమై భరోసా ఇచ్చేందుకే జగన్ సోదరి షర్మిల ఈనెల 18 నుంచి ‘మరో ప్రస్థానం’ పాదయాత్రను నిర్వహిస్తున్నారన్నారు. మండల పరిధిలోని ఈతకోట గ్రామానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన వందమంది గోపాలపురంలో ఆయన సమక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ జగ్గిరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపు నిచ్చారు.

ఏలేశ్వరంలో 200 మంది చేరిక

ఏలేశ్వరం : గ్రామానికి చెందిన 200 మంది ఎస్సీలు శుక్రవారం మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అధ్వర్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి వైయస్ఆర్‌ సీపీలోకి వరుపుల సాదరంగా ఆహ్వానించారు.

తాజా వీడియోలు

Back to Top