యువభేరి ప్రారంభం..వైయస్ఆర్ కు నివాళి

అనంతపురంః వైయస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ యువభేరి ప్రాంగణానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వేదిక వద్ద దివంగత ముఖ్యమంత్రి డా. వైయస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  జై జగన్ నినాదాలతో ఎంవైఆర్ కళ్యాణ మండపం మార్మోగింది. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, జై జగన్ అంటూ యువకులు నినదించారు. ప్రత్యేక హోదా ఆవశ్యకతపై వైయస్ జగన్ విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ 9 యువభేరిలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నేడు అనంతలో పదవ యువభేరి జరుగుతోంది. ప్రత్యేకహోదా వస్తేనే యువతకు భవిష్యత్తు ఉంటుందని, హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వైయస్ జగన్ యువభేరి సదస్సుల ద్వారా యువతను చైతన్యపరుస్తున్నారు.

Back to Top