కాకినాడ కార్పొరేషన్‌ వైయస్‌ఆర్‌ సీపీదే

కాకినాడ: రైతులు, మహిళలు, యువత ఇలా ప్రతీ వర్గాన్ని చంద్రబాబు మోసం చేశారని, కాకినాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో వారంతా ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. కాకినాడ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైయస్‌ఆర్‌ సీపీ గెలుపు తథ్యమన్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ఇలా అన్నింటినీ చంద్రబాబు తన స్వార్థానికి తాకట్టు పెట్టారని ఆయన ఆరోపించారు. ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే ప్రజా సంక్షేమం జరుగుతుందని ప్రజలంతా విశ్వసిస్తున్నారన్నారు. 
 
Back to Top