హైదరాబాద్‌ నుంచి పారిపోయిన ధైర్యవంతుడు బాబు


– ఏపీకి అస్థిత్వం లేకుండా అన్యాయం చేశారు
– కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని పాతికేళ్లు వెనక్కినెట్టారు
– రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు
– నాలుగేళ్లలో నాలుగు లక్షల కోట్ల అవినీతి
– ప్రజలకు అభద్రతాభావం కల్పించిన బాబును మళ్లీ ఎందుకు ఆశీర్వదించాలి
– వైయస్‌ జగన్‌ను విమర్శించడం సిగ్గుచేటు
– టీడీపీ మహానాడులో కూడా వైయస్‌ జగన్‌ జపమే
– లోకేష్‌ ముందుగా చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు నేర్చుకోవాలి
– సొంతంగా పార్టీ పెట్టుకోలేని వ్యక్తి చంద్రబాబు

హైదరాబాద్‌: చంద్రబాబు ధైర్యం గురించి మాట్లాడటం  పిల్లి వచ్చి పులి ముందు తొడగొట్టినట్లుగా ఉందని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అభివర్ణించారు. తెలంగాణలో కేసీఆర్‌ ఏసీబీ అనగానే ఉమ్మడి రాజధానిని వదిలి అర్ధాంతరంగా పారిపోయిన చంద్రబాబు వైయస్‌ జగన్‌ ధైర్యం గురించి మాట్లాతున్నారని విమర్శించారు. వడ్డించిన విస్తరి ముందు భోజనం చేసే చంద్రబాబు వైయస్‌ జగన్‌ను విమర్శించడం సిగ్గుచేటని వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ను ప్రజలు విశ్వసిస్తున్నారని, అందుకే ప్రజలు పాదయాత్రలో ఆయన వెంట నడుస్తున్నారని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని చంద్రబాబు పాతికేళ్లు వెనక్కి నెట్టారని మండిపడ్డారు.  ఇన్ని కష్టాలు తెచ్చి పెట్టిన చంద్రబాబును మళ్లీ ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలని ఆమె ప్రశ్నించారు. నాలుగేళ్ల పాలన పూరై్తన సందర్భంగా చంద్రబాబు చేసిన వాగ్ధానాలు చూస్తే ఆశ్చర్యమేస్తుందన్నారు. 18 మంది ఎంపీలను పక్కన పెట్టుకున్న చంద్రబాబు ఏమీ చేయలేకపోయారని, ఈయనకు 25 ఎంపీ స్థానాలు ఇస్తే ఏదో చేస్తానని కళ్లిబొల్లి మాటలు చెబుతున్నారని విమర్శించారు. నాలుగేళ్లు కేంద్రంతో జతకట్టి..ఇద్దరు కేంద్ర మంత్రులను పెట్టుకొని రాష్ట్రానికి చేసిందేంటని ఆమె ప్రశ్నించారు. ఈ నాలుగేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలు చెప్పలేని పరిస్థితి ఉందన్నారు. 

వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ధైర్యం లేదని చంద్రబాబు విమర్శించడం సిగ్గుచేటు అన్నారు. పిల్ల వచ్చి పులి ముందు తొడగొట్టినట్లుగా ఉందని ఆమె ఎద్దేవా చేశారు. ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏసీబీ అనగానే పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను వదిలి అమరావతికి పరుగులు తీసిన చంద్రబాబు ఇవాళ ధైర్యం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఒక కేసు విచారణ అంటేనే కోర్టుకు వెళ్లే స్టేలు తెచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఏపీకి అస్థిత్వం లేకుండా అన్యాయం చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని విమర్శించారు. సోనియా గాంధీతో కుమ్మక్కై వైయస్‌ జగన్‌పై కుట్రలు చేశారన్నారు. ప్రజల వైపు నిలబడిన ధైర్యవంతుడి ముందు చంద్రబాబు పిరికితనం తొడగొడుతుందన్నారు. సొంత పార్టీ పెట్టలేని ధైర్యవంతుడు చంద్రబాబుఅని విమర్శించారు. మామ పెట్టిన పార్టీని, జెండాను లాక్కొని వడ్డించిన విస్తరి ముందు భోజనం చేసే చంద్రబాబు ఇవాళ ధైర్యం గురించి మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. వైయస్‌ జగన్‌పై కొత్త కేసులు పెట్టండి అని అడిగిన చంద్రబాబు ఇవాళ మాట్లాడటం దుర్మార్గమన్నారు. ప్రజలు వైయస్‌ జగన్‌ను నిలబెట్టుకున్నారు కాబట్టి..మీరు కుయుక్తులు పన్ని 1 శాతం ఓట్లతో గత ఎన్నికల్లో గెలిచారని గుర్తు చేశారు. ఇవాళ వైయస్‌ఆర్‌సీపీ ఎదురులేని పార్టీగా నిలబడిందన్నారు. టీడీపీ మహానాడులో ప్రతి ఒక్క నాయకుడు వైయస్‌ జగన్‌ జపం చేశారన్నారు.

– మాట్లాడటం రాని నాయకుడు లోకేష్‌ కూడా ఇవాళ మాట్లాడుతున్నారన్నారు. ఆయనకు మాట్లాడటం రాదు కాబట్టి రాసిచ్చిన ట్వీట్లతో రెచ్చిపోతున్నారన్నారు. తలకిందులుగా శీర్షాసనం వేసినా వైయస్‌ జగన్‌ స్థాయికి రాలేరన్నారు. అమరావతి అని స్పష్టంగా పలికితే పాస్‌ మార్కుSలు పడతాయన్నారు. జయంతికి, వర్ధంతికి తేడాలు నేర్చుకోవాలన్నారు. వైస్రాయ్‌ రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు మీ నాన్న నుంచి నేర్చుకోవాలని లోకేష్‌కు సూచించారు. అన్నింటికంటే ముందు లోకేష్‌ ఎమ్మెల్యేగా గెలవడం నేర్చుకోవాలన్నారు. పప్పు అన్న బిరుదు నుంచి బయట పడి బాట్లాడితే మేం స్పందిస్తామన్నారు. నాలుగు అడుగులు కష్టపడి వేయలేని లోకేష్‌ ట్వీట్లకు మేం ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నాలుగేళ్లలో నాలుగు లక్షల కోట్లు సంపాదించడం బాగానే నేర్చుకున్నారని విమర్శించారు. ఎలా మాట్లాడాలో నేర్చుకొని ట్వీట్లు పెడితే మాడు పగిలేలా సమాధానం చెబుతామని వాసిరెడ్డిపద్మ హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్లు వైయస్‌ జగన్‌పై విమర్శలు చేస్తే సహించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. 

 
Back to Top