మదమెక్కిన ఆంబోతుల్లా టీడీపీ నేతల మాటలు

కుట్ర రాజకీయాల నిగ్గు తేల్చాలి
రాజకీయంగా ఎదుర్కోలేక భౌతికదాడులకు తెగబడ్డారు
సానుభూతి రాజకీయాలు వైయస్‌ ఇంటా.. వంటా లేవు
చంద్రబాబు రాజకీయ పుట్టుక, ప్రయాణం అంతా కుట్రే
కేశినేని నాని, సోమిరెడ్డి నోరు అదుపులోపెట్టుకొని మాట్లాడాలి
హత్యా రాజకీయాలు చేయడమే మీ పార్టీ సిద్ధాంతాలా?
కేంద్ర ప్రభుత్వ సంస్థలపై విచారణ జరగాలి
పెయిడ్‌ ఆర్టిస్టు శివాజీని విచారిస్తే అన్ని నిజాలు బయటకు వస్తాయి
హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం జరగడంపై రాష్ట్రమంతా బాధపడుతుంటే టీడీపీ నాయకులు మదమెక్కిన ఆంబోతుల్లా మాట్లాడుతున్నారని పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్‌బాబు ధ్వజమెత్తారు. జననేతపై జరిగిన హత్యాయత్నాన్ని నిరసిస్తూ వివిధ స్థాయిలో పార్టీ శ్రేణులన్నీ సంయుక్తంగా ఆందోనలు, ప్రార్థనలు చేసిన కార్యకర్తలు, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో సుధాకర్‌బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ రాజకీయ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడిపై జరగని మాటల దాడి వైయస్‌ జగన్‌పై నిరంతరం జరుగుతూనే ఉన్నాయని, కులగజ్జి మీడియాతో తప్పుడు ప్రచారాలు సైతం చేయించారని, అది చాలదన్నట్లుగా చివరకు భౌతికంగా దాడులు చేయడం మొదలుపెట్టారని మండిపడ్డారు. 

సానుభూతి కోసం, ప్రచారం కోసం వైయస్‌ఆర్‌ సీపీ హత్యాయత్నం చేసుకున్నట్లు ఎల్లో మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును సూటిగా అడుగుతున్నాం.. హత్యాయత్నం చేసిన నాటి నుంచి పిచ్చి కుక్కల్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్న మదమెక్కిన ఆంబోతులను అడుగుతున్నాం.. ఎవరికి ప్రచారం అవసరం.. ఎవరికి సానుభూతి కావాల్సి వచ్చిందో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. సానుభూతి కోసం చౌకబారు రాజకీయాలు చేయడం వైయస్‌ జగన్‌ ఇంటా వంటా లేదన్నారు. 

చంద్రబాబు రాజకీయ పుట్టుక, ప్రయాణం అంతా అబద్ధాలతో కూడుకున్నదేనని సుధాకర్‌బాబు విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఉంటన్న పార్టీ అతనిది కాదు.. ముఖ్యమంత్రి పదవి కూడా ఆయనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి దొంగలించాడన్నారు. చంద్రబాబు చుట్టూ ఉన్న తాబేదారులు కుట్ర సమూహం. దొంగల ముఠా అని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకుల దోపిడీని వైయస్‌ జగన్‌ ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారని, చంద్రబాబు అవినీతిని ఎండగడుతున్నారని, టీడీపీ స్థాయిని S కిందకు దించాడనే ఆక్రోశం, ఆవేశంతోనే వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం చేశారన్నారు. 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి మరణించిన నాటి నుంచి నేటి వరకు వైయస్‌ జగన్‌ ప్రజా రాజకీయాలను నమ్మారు.. ప్రజల అవసరాలు తెలుసుకొని వాటిని పరిష్కరించడం కోసం ప్రాణాలను పనంగా పెట్టి పోరాడారన్నారు. సానుభూతి ఉపయోగించుకోవాలనుకుంటే వైయస్‌ జగన్‌ ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యేవారని. వెదవల్లా మాట్లాడుతున్న టీడీపీ నేతలు ఇది గుర్తు పెట్టుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కావడం వైయస్‌ జగన్‌ లక్ష్యం కాదని, రాజన్న రాజ్యం మళ్లీ తీసుకురావావడం కోసం పనిచేస్తున్నారన్నారు. 

టీడీపీ ఎంపీ కేశినేని నాని మీడియా ముందుకు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే ముక్కలు ముక్కలుగా నరికిస్తారని మాట్లాడుతున్నారని సుధాకర్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలేనా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, పార్టీ మీకు నేర్పించిన రాజకీయం ఇదేనా అని కేశినేనిని ప్రశ్నించారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మేము తలచుకుంటే ఇలా గిల్లుకోవడం.. గిచ్చుకోవడం ఉండదని మాట్లాడుతున్నాడు.. సిగ్గుందా.. సోమిరెడ్డి అని సుధాకర్‌బాబు విరుచుకుపడ్డారు. టీడీపీ నాయకుల మాటలు వింటుంటే ఒళ్లంతా గగుర్లు పుడుతోందని, ఆవేశం కట్టలు తెంచుకుంటుందని, అయినా వైయస్‌ జగన్‌ శాంతికాముకుడు కాబట్టే పార్టీ నాయకులు, కార్యకర్తలమంతా శాంతియుతంగా వ్యవహరిస్తున్నామన్నారు. సంక్షోభాన్ని అవకాశంగా మార్చుకోవడంలో చంద్రబాబు దిట్ట అని ప్రతిపక్ష నాయకుడిపై జరిగిన దాడి గురించి చంద్రబాబు తనకు అనుకూలంగా మాట్లాడడం హేయనీయమన్నారు. విమానాశ్రయంలో దాడి జరిగినా కార్యకర్తలు అధైర్యపడతారని వైయస్‌ జగన్‌ మొహంపై చిరునవ్వు చెరగకుండా హైదరాబాద్‌కు వచ్చి చికిత్స పొందారన్నారు. 

సిగ్గులేని, చేతగాని చంద్రబాబు ప్రభుత్వం ఆపరేషన్‌ గరుడ విషయంపై విచారణ చేపట్టాలని సుధాకర్‌బాబు డిమాండ్‌ చేశారు. ఆపరేషన్‌ గరుడలో అంతర్‌భాగం ఏంటీ.. ఇది కుట్ర అని ఉచ్చరించిన చంద్రబాబు సీబీఐ విచారణకు ఆమోదించాలన్నారు. వైయస్‌ జగన్‌పై రెండుసార్లు రెక్కీ జరిగిందని, గుంటూరులో, హైదరాబాద్‌లో రెక్కీ జరిగిందని పెయిడ్‌ ఆర్టిస్టు శివాజీ చెప్పాడని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించి పోలీసులను కాపలాదారులుగా తయారు చేసుకున్న చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వెళ్లారో చెప్పాలన్నారు. ఇంకో నాలుగు నెలలు ఉండే దద్దమ్మ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం ఎవరికి ఉందో తేల్చాలన్నారు. పాలన చూపించి ప్రజల వద్దకు వెళ్లే దమ్ము లేక చంద్రబాబు డొంక తిరుగుడు రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. బాబు కుట్రకు వంగవీటి రంగా, వైయస్‌ రాజారెడ్డి, అనేక మంది బలైపోయారన్నారు. 

ప్రతిపక్ష నాయకుడిపై దాడి జరిగితే కనీసం మీడియా ముఖంగానైనా పరామర్శించకుండా.. ఘటనను తనకు అనుకూలంగా మల్చుకోవడానికి చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నాడని సుధాకర్‌బాబు మండిపడ్డారు. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో ఆపరేషన్‌ గరుడపై ఎంక్వైరీ చేయించాలని డిమాండ్‌ చేశారు. నిందితుడి కుటుంబాన్ని ఎందుకు కలవనివ్వడం లేదు.. ఆ కుటుంబాన్ని బయటకు రానివ్వకుండా ఎందుకు దాచారో.. తేలాలన్నారు. పెయిడ్‌ అరిస్టు శివాజీని తక్షణమే అరెస్టు చేసి విచారణ చేపడితే అన్ని నిజాలు బయటకు వస్తాయన్నారు. కేశినేని నాని, సోమిరెడ్డి, బుద్ధా వెంకన్న, అచ్చెన్నాయుడు ఆంబోతుల్లా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. 
 
Back to Top