అధికార పార్టీ ఒత్తిడితోనే కేసు: అత్తార్, విశ్వ

అనంతపురం: తమ పార్టీ ఎంపీపీ ఏ తప్పూ చేయలేదు కాబట్టే చట్టంపై ఉన్న గౌరవంతో స్వచ్ఛందంగా లొంగిపోతున్నారని కదిరి, ఉరవకొండ ఎమ్మెల్యేలు అత్తార్ చాంద్‌బాషా,  విశ్వేశ్వరరెడ్డి అన్నారు.  స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ ఎన్‌వీ రామాంజనేయులు, నల్లమాడ సీఐ రవీంద్రనాథ్‌రెడ్డితో వారు మాట్లాడారు. నల్లమాడ ఎంపీపీ బ్రహ్మానందరెడ్డిపై అధికార పార్టీ ఒత్తిళ్లతో అధికారులు కేసుపెట్టారని ఆరోపించారు.ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రజా సంక్షేమం కోసం పనిచేసేవారని.. అలాంటి వారి మధ్య ఇలాంటి వివాదాలు చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. తమ పార్టీ ఎల్లప్పుడూ  అధికారులకు అండగా ఉంటుందన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లతో కేసు పెట్టారని అధికారులు ఆ కేసును ఉపసంహరించుకుంటే బాగుంటుందన్నారు.
Back to Top