అభివృద్ధి..సంక్షేమం అటకెక్కాయి– టీడీపీ నేతల అక్రమాల్లో అభివృద్ధి
– ఏపీలో ఎక్కడ చూసినా అనారోగ్యం తాండవిస్తోంది
– ఆరోగ్యశ్రీ అటకెక్కింది
– డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదు
– ఒక్క పరిశ్రమ అయినా ఏర్పాటు చేశారా?
విశాఖ: చంద్రబాబు పాలనలో అభివృద్ధి..సంక్షేమం అటకెక్కాయని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏం చేశారని టీడీపీ నాయకులు పండుగలు చేస్తున్నారని ఆయన నిలదీశారు. విశాఖ పట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏ రంగంలో అభివృద్ధి చెందారో చెప్పాలని బొత్స సత్యనారాయణ డిమాండు చేశారు. ఈ నాలుగున్నరేళ్లలో చంద్రబాబు అవినీతిలో అభివృద్ధి చెందారని, అక్రమాల్లో అభివృద్ధి చెందారని విమర్శించారు. దోపిడీలో తప్ప ఏ దిక్కూచిలో అభివృద్ధి చెందిందో చెప్పాలని పట్టుబట్టారు. రాష్ట్రంలో ప్రజలు అనారోగ్యంతో కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. ఎక్కడా చూసినా విష జ్వరాలు, డెంగీ వ్యాధితో ప్రజలు అల్లాడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ అటకెక్కిందని, 108 వాహనం టైర్లలో గాలి తీసేశారని ఎద్దేవా చేశారు. 104 వాహనం ఎక్కడా కనిపించడం లేదన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని, మొదటి విడతలో వేసిన రూ.3 వేలు ముట్టుకోవడానికి వీలు లేకుండా పోయిందన్నారు. రెండో విడతలో వేసిన రూ.3 వేలు కొంత మందికి వచ్చాయి..మరి కొంత మందికి రాలేదన్నారు. మహిళలకు రూ.10 వేలు ఇచ్చామనడం పచ్చి అబద్ధం అన్నారు. నిరూపిస్తే దేనికైనా సిద్ధమే అని సవాలు విసిరారు.  వైయస్‌ఆర్‌సీపీ వాస్తవాలు చెబుతోందన్నారు. మహిళల పట్ల అబద్ధాలు చెప్పకూడదన్నారు. కానీ చంద్రబాబు ఎవరికైనా అబద్దాలు చెప్పడంలో దిట్ట అన్నారు.
– పేదలందరికీ మూడు సెంట్ల స్థలం, పక్కా ఇల్లు కట్టిస్తామన్న చంద్రబాబు మాట తప్పారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఎన్‌టీఆర్‌ పథకం పేరుతో పేర్లు మార్చారని, ఇందిరమ్మ ఇళ్లకు పెయింట్‌ వేసి హడావుడి చేశారన్నారు. ఈ నాలుగేళ్లు పాలన గాలికి వదిలేశారని, మళ్లీ ఐదేళ్లు వీరికి అధికారం  ఇవ్వాలట అని విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నీర్విర్యం చేశారని మండిపడ్డారు. కాలేజీ ఫీజులు విఫరీతంగా పెంచారన్నారు. 
– కాపు కార్పొరేషన్‌కు రూ.3500 కోట్లు బడ్జెట్‌లో పెట్టారని, వీటిని ఖర్చే చేయలేదని బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఎల్లకాలం ఎవరిని మోసం చేస్తామని మండిపడ్డారు. రైతుల రుణమాఫీ వడ్డీలకే సరిపోలేదన్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు లేకుండానే రుణమాఫీ ఎలా చేశారనిప్రశ్నించారు. మీ వద్ద ఏమైనా మంత్రదండం ఉందా అని నిలదీశారు. ఇది ధర్మమేనా అని ప్రశ్నించారు.
– విశాఖ–చెన్నై కారిడార్‌ పూర్తి చేశామని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. పెట్రో కెమికల్‌ కారిడార్‌పై చంద్రబాబు ప్రకటనలు హాస్యాస్పదమన్నారు. విశాఖలో మూడు సార్లు పార్ట్‌నర్‌ షిప్‌ సమ్మిట్లు పెట్టారని, ఇంతవరకు రూ.4538 కోట్లు మాత్రమే వచ్చాయన్నారు. కానీ చంద్రబాబు మాత్రం రూ.6 లక్షల కోట్లు వచ్చాయని అబద్ధాలు చెబుతున్నారని, ఒక్క పరిశ్రమ అయినా నెలకొల్పిరా అని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో బాండ్రిక్స్‌ పరిశ్రమ స్థాపించారన్నారు. 18 వేల మందికి ఉపాధి కల్పించింది వాస్తవం కాదా అన్నారు. 
 
Back to Top