అవిశ్వాస తీర్మానాన్ని బాబు విభేదిస్తున్నారు

 హైదరాబాద్: పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు వైయస్‌ఆర్‌సీపీ సిద్ధంగా ఉందని, చంద్రబాబు విభేదిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రతిపక్షానికి చట్టాలు తెలియన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. చట్టాలు తెలియనిది మాకా..మీకా అని నిలదీశారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు. కేంద్రంపై అవిశ్వాసం పెట్టడానికి మేం రెడీగా ఉన్నామని మా అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇప్పటికే ప్రకటించారన్నారు. అవిశ్వాసం అవసరం లేదని చంద్రబాబు అంటున్నారని, ఆ అంశాన్ని తెరపైకి తెచ్చింది టీడీపీ భాగస్వామ్య పార్టీయే అన్నారు. అవిశ్వాసంపై మాకు ఎవరు మద్దతిచ్చినా అభ్యంతరం లేదన్నారు. సీఎం వ్యాఖ్యలపై పవన్‌ ఎలా స్పందిస్తారో చూడాలని బొత్స అన్నారు. చంద్రబాబు ఇంకా ప్రజలను ఎన్నాళ్లు మోసం చేస్తారో తెలియదని, కేసుల భయంతోనే చంద్రబాబు రాజీనామాలు, అవిశ్వాస తీర్మానం వద్దంటున్నారని, మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, ప్రత్యేక హోదా కోసం మా పోరాటం కొనసాగుతుందని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. 
 
Back to Top