ఏపీలో రాజ్యాంగం అపహాస్యం



– రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఒక్క శాతం కూడా మెరుగుపడలేదు
– దళితులను సభకు తరలించడానికి బాబు రంగం సిద్ధం చేశారు
– నెల్లూరు సభలో దళితులకు ఏం సమాధానం చెబుతారు
– దళిత భూములు కొల్లగొట్టారు

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగం అపహాస్యమైందని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున విమర్శించారు. చంద్రబాబు దళిత తేజం పేరుతో మభ్యపెడుతున్నారని, వాస్తవంగా దళితులకు చేసింది ఏమీ లేదన్నారు. నెల్లూరులో నిర్వహించిన సభకు దళితులను భయపెట్టి, డబ్బులిచ్చి తరలించేందుకు సిద్ధమయ్యారని విమర్శించారు. విజయవాడలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దళితులకు చంద్రబాబు ఉద్దరించారని, దళితుల సంక్షేమానికి మీరు చేసింది ఏంటని 
 మేరుగు నాగార్జున ప్రశ్నించారు. మీరు దళితులకు ఏం అంశంతో వెలుగు నింపారని నిలదీశారు. ఈ రాష్ట్రంలో దళితులు తల ఎత్తుకుని తిరిగేలా ఏం చేశారో చెప్పాలన్నారు. ఏపీలో జరిగిన దళితుల దాడుల్లో నాలుగో స్థానంలో నిలిపారన్నారు. రాష్ట్రంలో దళితుల ఆధీనంలో ఉన్న భూములను 90 శాతం టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు కొల్లగొట్టారన్నారు. ఈ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చి న  తరువాత రాజధాని ప్రాంతంలో దళితుల భూములు లాక్కొని, ఒక్క సెంట్‌ కూడా ఇవ్వలేదన్నారు. దేవరపల్లి, కొండపల్లి, కొవ్వాడ, ఓర్వకల్లు గ్రామాల్లో దళితుల భూములు లాక్కున్నారన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత రాజ్యంగం అపహాస్యమైందన్నారు. రాష్ట్రంలో దాడులు, ఆకృతాలు అధికమయ్యాయన్నారు. అంబేద్కర్‌ రాజ్యాంగం ప్రకారం పాలన సాగడం లేదన్నారు. మహానుబావుడు అంబేద్కర్‌ విగ్రహం పెడుతుంటే దళితులను వెలివేసిన గగరప్రరు గురించి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నక్కలదిన్నే, వల్లంపల్లి వంటి ప్రాంతాల్లో దళితులను వెలి వేస్తే చంద్రబాబు నోరు మూగబోయిందన్నారు. సభ్యసమాజం తలదించుకునే విధంగా విశాఖ జిల్లా పెందుర్తి మండలం జె్రరిపోతుల పాలెంలో ఓ దళిత మహిళను టీడీపీ శాసన సభ్యుడి అండదండలతో వివస్త్రను చేసి దుశ్సాన పర్వం కొనసాగిస్తే టీడీపీ నేతలపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. మహిళలకు జరుగుతున్న ఆకృత్యాలలో ఆంధ్రప్రదేశ్‌  అగ్రభాగంలో ఉందన్నారు. మాదిగ సోదరులు తోలు చర్మాన్ని ఎక్కడో ఒలుచుకుంటుంటే ఆవు చర్మాన్ని ఒలిచారని టీడీపీ నేతలు వచ్చి దళితులను చెట్టుకు కట్టేసి కొట్టారన్నారు. ఈ ఘటనపై చంద్రబాబు నోరు మెదపలేదన్నారు. గుంటూరు జిల్లాలో రవి కుమార్‌ అనే ఉద్యోగి మీ రాబంధుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటే..బాధ్యులపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదన్నారు. రూ.40 వేల కోట్లు వెచ్చించి ఏమీ చేయకపోయినా ఇది చేశాం..అది చేశామని హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారన్నారు. బడ్జెట్‌లో చంద్రబాబు దళితులకు సంబంధించిన ప్లాన్‌ బడ్జెట్‌ ఎంత తగ్గించారో అందరికి తెలుసు అన్నారు. ప్లాన్‌ బడ్జెట్‌ తగ్గించి, నాన్‌ బడ్జెట్‌ పెంచారన్నారు. దళితులకు రాజ్యాంగబద్ధంగా, జనాభా ప్రతిపాదికన రావాల్సిన డబ్బులు ఎంత ఖర్చు చేశారని నిలదీశారు. చంద్రబాబు విమానాల్లో తిరుగుతూ దళితులను చూశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు భోగభాగ్యాలకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్‌ నిధులు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. దళితుల కోసం ఎంత ఖర్చు పెట్టారో సమాధానం చెప్పగలరా అని చాలెంజ్‌ విసిరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల హాస్టల్స్‌ మూసివేశారో చెప్పాలన్నారు. అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. దళితులు ప్రాథమిక విద్య ఎప్పుడు చదువుతారో అప్పుడే అభివృద్ధి సాధ్యమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో చంద్రబాబు తన మనిషిని నియమించి దళితులకు అన్యాయం చేశారన్నారు. 
 
Back to Top