బడుగుల అభివృద్ధి కాంక్షించిన మహనీయుడు అంబేద్కర్‌

అనంతపురంలో ఘనంగా రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం
అంబేద్కర్‌ విగ్రహానికి వినతి అందించిన మేరుగు నాగార్జున
అనంతపురం: పేద, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి రాజ్యాంగాన్ని ప్రసాదించిన వ్యక్తి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగు నాగార్జున కొనియాడారు. అనంతపురం జిల్లాలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేరుగు నాగార్జున హాజరై అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం పిలుపు మేరకు అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాయని మండిపడ్డారు. చట్టాలను చంద్రబాబు చుట్టాలుగా మార్చుకుంటూ దళితులపై దాడులకు తెగబడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం జరుపుకుంటుందన్నారు. 
ఉరవకొండలో.. 
చంద్రబాబు రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ నిసిగ్గుగా ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాడని వైయస్‌ఆర్‌ సీపీ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. నియోజకవర్గ పరిధిలోని విడపనకల్లులో అంబేద్కర్‌ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

తాజా వీడియోలు

Back to Top