మంత్రులు గంటా, నారాయణలను బర్తరఫ్‌ చేయాలి

విశాఖ: నారాయణ, శ్రీచైతన్య కళాశాలల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన బాట పట్టింది. విశాఖపట్నంలో వైయస్‌ఆర్‌ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో కార్పొరేట్‌ కళాశాలల బంద్‌ చేపట్టారు. విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా నారాయణ కాలేజీ ఎదుట వైయస్‌ఆర్‌ సీపీ విద్యార్థి విభాగం నాయకులు బైఠాయించారు.  కార్పొరేట్‌ కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా, కడపలో పార్టీ విద్యార్థి విభాగం నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. విద్యా శాఖామంత్రి గంటా శ్రీనివాసరావు, నారాయణ కళాశాల యజమాని మంత్రి నారాయణను వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

Back to Top