న్యూ ఢిల్లీలో ‘ప్ర‌త్యేక‘ పోరాటం


- పార్లమెంట్‌ వద్ద వైయ‌స్‌ఆర్‌ సీపీ ఎంపీల ఆందోళన 
- పార్ల‌మెంట్‌లో వాయిదా తీర్మానం


 న్యూఢిల్లీ : విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలపై వైయ‌స్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. దేశ రాజ‌ధాని వేదిక‌గా మ‌రోసారి ఉద్య‌మం చేప‌ట్టి కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. మంగ‌ళ‌వారం ఉద‌యం వైయ‌స్‌ఆర్‌ సీపీ ఎంపీలు పార్లమెంట్‌ గేట్‌-1 వద్ద    ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలంటూ ఫ్లకార్డులు ప‍్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌, విశాఖకు రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలంటూ నినాదాలు చేశారు. కడప స్టీల్‌ ప్లాంట్‌, దుగరాజపట్నం పోర్టుతో పాటు పోలవరం ప్రాజెక్ట్‌ను 2019 కల్లా పూర్తి చేయాలంటూ డిమాండ్‌ చేశారు. మరోవైపు లోక్‌సభలో ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వాయిదా తీర్మానం నోటీసు ఇవ్వగా, రాజ్యసభలో ఎంపీ విజయసాయి రెడ్డి కాలింగ్‌ అటెన్షన్‌ నోటీసులు ఇచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, లోక్‌సభ ఎంపీలు మిథున్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్‌, వైయ‌స్‌ అవినాష్‌ రెడ్డి పాల్గొన్నారు. 

గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా..
వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేతృత్వంలో ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటం కొన‌సాగుతోంది. ధ‌ర్నాలు, రాస్తారోకోలు, బంద్‌లు నిర్వ‌హించి త‌మ ఆకాంక్ష‌ను వెల్ల‌డించారు. అలాగే యువ‌త‌ను చైత‌న్య‌వంతం చేసేందుకు యూనివ‌ర్సిటీల్లో యువ‌భేరీలు నిర్వ‌హించారు. విశాఖ‌లో జై ఆంధ్ర‌ప్ర‌దేశ్ పేరుతో భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించారు. ప్ర‌త్యేక హోదాపై సీఎం చంద్రబాబు కేంద్రాన్ని డిమాండ్ చేయడం లేదు.  ప్రధాని మోదీ విజయవాడకు వచ్చినప్పుడు హోదా కోసం చంద్రబాబు ప్రస్తావిస్తారని అనుకుంటే... ఆ ఊసు కూడా ఎత్తలేదు.హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ రెండు బంద్‌లకు పిలుపు ఇచ్చిందని, ఆ బంద్‌లకు ప్రభుత్వం మద్దతు తెలపలేదు.  పైగా ఆర్టీసీ బస్సులను నడిపించే ప్రయత్నం చేసింది.  బంద్ జరిగితే ప్రత్యేక హోదా వస్తుందని అందరం ఆరాటపడుతుంటే... బంద్ ఎలా విఫలం చేయాలని చంద్రబాబు ఆలోచనలు సాగాయి.పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీనే అమలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నా..పోరాటాన్ని ఉధృతం చేశారు. 



Back to Top