క్షీణిస్తున్న ఎంపీల ఆరోగ్యం


- ఐదో రోజులు దీక్ష కొస‌సాగిస్తున్న మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి
- ప‌డిపోతున్న బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ 
 న్యూఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసంవైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మొక్కవోని సంకల్పంతో ముందుకుసాగుతోంది. ఐదుకోట్ల ఆంధ్రుల కోసం, విభజన హక్కుల సాధన కోసం అన్నపానాలు మరిచి.. ఎంపీలు ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి కొనసాగిస్తున్న దీక్ష మంగళవారం ఐదోరోజుకు చేరుకుంది.  ఐదు రోజులుగా దీక్షలో ఉండటంతో మిథున్‌, అవినాశ్‌ బాగా నీరసించిపోయారు. దీంతో వారికి డాక్టర్లు మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహించారు.

ఆందోళ‌న‌క‌రం..
దీక్ష కొనసాగిస్తున్న ఎంపీలు మిథున్‌రెడ్డి, అవినాశ్‌రెడ్డి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. కఠోర దీక్ష చేస్తున్న ఈ ఇద్దరు యువనేతల బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ పడిపోతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. అవినాశ్‌రెడ్డి బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ 78​కి పడిపోయాయి. ఒక్కరోజులోనే ఆయన షుగర్‌ లెవల్స్‌ 94 నుంచి 78కి పడిపోయాయి. మిథున్‌రెడ్డి శరీరంలోనూ బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ 80కి పడిపోయాయి. ఒక్కరోజులోనే ఆయన షుగర్‌ లెవల్స్‌ 82 నుంచి 80కి పడిపోయాయి.
Back to Top