వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన ఎంపీలు

విజ‌య‌వాడ‌: ప్రత్యేక హోదా సాధన కోసం ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేసిన వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు నూజివీడు నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేస్తున్న వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిశారు. కొద్ది సేప‌టి క్రిత‌మే వారు వైయ‌స్ జ‌గ‌న్ బ‌స చేసే ప్రాంతానికి చేరుకున్నారు. ఢిల్లీ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్‌ అవినాష్ రెడ్డిలకు  ఘన స్వాగతం లభించింది. పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున విమానాశ్రయానికి చేరుకుని ఎంపీలకు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి భారీ ర్యాలీగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్ రెడ్డి పాదయాత్ర వద్దకు పార్టీ ఎంపీలు తరలి వెళ్లారు. వైయ‌స్ జ‌గ‌న్ ఎంపీల‌తో సమావేశమై ప్రత్యేక హోదా ఉద్యమ కార్యచరణపై  చర్చించనున్నారు.  
Back to Top