ఎన్‌డీఏకు చిత్త‌శుద్ధి ఉంటే హోదాపై చ‌ర్చించాలి

ఢిల్లీ: ఎన్‌డీఏ ప్ర‌భుత్వానికి చిత్త‌శుద్ధి ఉంటే వైయ‌స్ఆర్‌సీపీ పార్ల‌మెంట్‌లో ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌స‌భ‌లో చ‌ర్చించాల‌ని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.ప్ర‌త్యేక హోదాపై స‌భ‌లో చర్చ జ‌రిగే వ‌ర‌కు ప‌ట్టుబ‌డ‌తామ‌ని, మ‌రోసారి ఈ విష‌యంపై స్పీక‌ర్‌ను క‌లుస్తామ‌ని ఆయ‌న తెలిపారు. గురువారం ఉద‌యం వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కోరుతూ ధ‌ర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..నాలుగేళ్లుగా ప్ర‌త్యేక హోదా కోసం వైయ‌స్ జ‌గ‌న్ అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్నార‌న్నారు. ఎవ‌రు హోదా కోసం పోరాటం చేస్తున్న‌ది ప్ర‌జ‌ల‌కు తెలుసు అన్నారు. లోక్‌స‌భ‌లో అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ జ‌రిగేలా అన్ని పార్టీలు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.
 
Back to Top