ఉప ఎన్నికలకు సిద్ధమా బాబూ?


పశ్చిమ గోదావరి: ఎన్నికలంటే చంద్రబాబుకు భయం పట్టుకుందని, దమ్ముంటే ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సవాల్‌ విసిరారు. మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లాలో ఆయన ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్నారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు 14 నెలల ముందే ఎంపీ పదవులకు రాజీనామాలు చేశామన్నారు. రేపు స్పీకర్‌ను కలిసి మా రాజీనామాలు ఆమోదించుకుంటామన్నారు. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు డ్రామాలాడారన్నారు. బాబుకు దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని ఆయన సవాల్‌ విసిరారు. ఉప ఎన్నికలకు చంద్రబాబు సిద్ధమా అని వైవీ సుబ్బారెడ్డి సవాల్‌ విసిరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.  
 
Back to Top