ఇది టీడీపీ– బీజేపీ నాటకమే


– పార్టీ మారిన సభ్యురాలిని ఎలా అఖిలపక్షానికి పిలిచారు?
– కేంద్ర మంత్రి నిర్ణయం నీతి బాహ్యమైన చర్య
– బుట్టా రేణుకను పిలువడం వెనుక టీడీపీ హస్తం
– నాటుసారా అమ్మునే రమేష్‌ను ఎంపీగా చేసిన ఘనత టీడీపీదే
– విభజన చట్టాన్ని తూ.చ తప్పక పాటించాలని ప్రధానిని కోరాను
– ప్రధాని సమక్షంలోనే అభ్యంతరం వ్యక్తం చేసిన విజయసాయిరెడ్డిన్యూఢిల్లీ: అఖిలపక్ష సమావేశానికి పార్టీ ఫిరాయించిన ఎంపీ బుట్టా రేణుకను వైయస్‌ఆర్‌సీపీ ప్రతినిధిగా పిలువడం టీడీపీ– బీజేపీ నాటకమే అని వైయస్‌ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.  ఈ అఖిలపక్ష సమావేశంలో మా పార్టీ నుంచి మారి టీడీపీలో చేరిన బుట్టా రేణుకను లోక్‌సభలో మా పార్టీ ప్రతినిధిగా ఆహ్వానించడం జరిగిందన్నారు. అఖిలపక్ష సమావేశం ప్రారంభం కాగానే ఈ విషయంపై పార్లమెంటరీ మంత్రి అనంతకుమార్‌ను ప్రశ్నించినట్లు చెప్పారు. మీరు ఏ అధికారంతో పార్టీ మారి..ఇంకో పార్టీకి అమ్ముడపోయిన ఎంపీని పిలిచారని నిలదీసినట్లు చెప్పారు. ఈ చర్యలు అధర్మమని మంత్రిని ప్రశ్నించినట్లు చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా మీరు చేసే చర్యలు సమంజసమా అని నిలదీశారు. ఇది నీతిభాహ్యమైన చర్యగా అభివర్ణించారు. స్పీకర్‌ అనర్హత వేటు విషయంలో నిర్ణయం తీసుకోలేదు కాబట్టి, మీ పార్లమెంట్‌ సభ్యులంతా రాజీనామా చేశారు కాబట్టి ..వైయస్‌ఆర్‌సీపీ తరఫున గెలిచిన సభ్యుల్లో బుట్టా రేణుకను అఖిలపక్షానికి పిలిచినట్లు మంత్రి వివరణ ఇచ్చినట్లు విజయసాయిరెడ్డి వివరించారు. బుట్టారేణుక పేరు తొలగించకపోతే అఖిలపక్ష సమావేశాన్ని బహిష్కరిస్తానని హెచ్చరించినట్లు ఆయన తెలిపారు. మా పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ నుంచి మీకు ఏమైనా లేఖ  ఇచ్చారా అని నిలదీయడంతో మిగతా ప్రతిపక్షాలు తనకు మద్దతుగా నిలిచారని చెప్పారు. అందరూ అనంతకుమార్‌ చర్యలను గర్హించడంతో అప్పుడు బుట్టా రేణుక నేమ్‌ప్లేట్‌ తొలగించారని వివరించారు. 
– బీజేపీ, టీడీపీ పొల్యూషన్‌ పాలిటిక్స్‌గా ఇలా జరిగిందని అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీ మారిన ఎంపీలు ఎస్పీవైరెడ్డి, బుట్టా రేణుక, కొత్తపల్లి గీతా, శ్రీనివాసులు రెడ్డి కూడా ఉన్నారని, బుట్టా రేణుకనే ఎందుకు పిలిచారని ప్రశ్నించారు. ఇందులో టీడీపీ పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. అఖిలపక్ష సమావేశంలో ప్రధాని సమక్షంలోనే ప్రధానంగా నాలుగు అంశాలను ప్రస్తావించినట్లు విజయసాయిరెడ్డి చెప్పారు. ఏపీ పునర్వీభజన చట్టంలో పొందుపరిచిన అంశాలను వెంటనే అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ మాత్రం వీలైతే విభజన చట్టంలోని అంశాలు అమలు చేయమని కోరినట్లుగా సమాచారం అందిందన్నారు. సీఎం రమేష్‌ అనే వ్యక్తికి తెలుగు పూర్తిగా రాదని, ఇంగ్లీష్‌ అసలే రాదని, హింది అంతకన్నా రాదన్నారు. నాటు సారా అమ్ముకునే వ్యక్తిని పార్లమెంట్‌ సభ్యుడిగా తెలుగు దేశం పార్టీ చేస్తే..అతనికి ఇంతకన్న ఏమీ అర్థమవుతుందని ప్రశ్నించారు. చట్టంలో పొందుపరిచినవే కాకుండా..పొందుపరచనివి కూడా బేషరత్తుగా అమలు చేయాలని తాను డిమాండు చేసినట్లు చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించే విషయంపై ప్రధాని సమక్షంలోనే తాను మాట్లాడినట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 
– పునర్వీభజన చట్టంలోని విశాఖ–చెన్నై కారిడార్‌ అంశం నిన్నటికి నిన్న టీడీపీ ప్రకటనలో పూర్తి చేసినట్లు చెప్పారని విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. ఆ కారిడార్‌ ఎక్కడ ఉందో నాకు అర్థం కావడం లేదన్నారు. పోలవరంలో అవినీతి తారా స్థాయికి చేరిందన్నారు. కోటాను కోట్ల అవినీతికి పాల్పడిన చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు.
– బీసీలకు జనాభా ప్రతిపాధికన  రిజర్వేషన్లు అమలు చేయాలని గతంలోనే మేం పార్లమెంట్‌లో ఓ ప్రైవేట్‌ బిల్లు ప్రవేశపెట్టినట్లు విజయసాయిరెడ్డి వివరించారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఉమెన్స్‌ రిజర్వేషన్‌ బిల్లుపై వెంటనే చట్టం చేయాలని ప్రధానికి కోరినట్లు తెలిపారు. 
– ఏపీ పునర్వీభజన చట్టంలోని విశాఖ రైల్వే జోన్‌ అంశాన్ని పొందుపరిచారని, అయినా కూడా బీజేపీ ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదన్నారు. ఆ విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తెచ్చినట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వీటన్నింటిపైన చర్చిస్తామని ప్రధాని అఖిలపక్ష సమావేశంలో చెప్పినట్లు విజయసాయిరెడ్డి వివరించారు. బుట్టా రేణుక విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అనర్హత వేటు చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, స్పీకర్‌ విషయంలో కాల పరిమితి విధించాలని కోరామన్నారు. పార్టీ ఫిరాయించిన వారిని 3 నెలల్లో అనర్హతవేటు వేయాలని కోరినట్లు చెప్పారు. ప్రజా సమస్యలను వేటిని కూడా టీడీపీ నాయకులు ప్రధాని దృష్టికి తీసుకురాలేదన్నారు. వాళ్ల ప్రయోజనాల కోసం పని చేస్తున్నట్లు ప్రస్పుటంగా కనిపిస్తుందన్నారు. చంద్రబాబుకు, ఆయన కుమారుడికి కూడా తెలుగు రాదన్నారు. సీఎం రమేష్‌ లాంటి వ్యక్తులను అఖిలపక్ష సమావేశానికి పంపిస్తే వారు ఏం చెబుతారని ఆయన ప్రశ్నించారు. 


 
Back to Top