ఏడాది ఓపిక ప‌ట్టండి
- విజయసాయి రెడ్డి సంఘీభావ యాత్ర రెండో రోజు ప్రారంభం
- విశాఖ‌లో అడుగ‌డుగునా బాధ‌లు చెప్పుకుంటున్న జ‌నం
  విశాఖపట్నం: మ‌రో ఏడాది ఓపిక ప‌డితే మ‌నంద‌రి ప్ర‌భుత్వం వ‌స్తుంద‌ని, జ‌గ‌న‌న్న ముఖ్య‌మంత్రి అవుతార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి భరోసా క‌ల్పిస్తున్నారు. విశాఖ‌లో విజ‌య‌సాయిరెడ్డి సంఘీభావ పాద‌యాత్ర రెండో రోజుకు చేరింది. ఈ సంద‌ర్భంగా నాలుగేళ్లుగా అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కో్సం విశాఖ‌వాసులు ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లుగా త‌మ బాధ‌లు ప‌ట్టించుకొని ప్ర‌భుత్వానికి శాప‌నార్థాలు పెడుతున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు సంఘీభావంగా వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యులు విజ‌య‌సాయిరెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర‌కు విశాఖ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. అడుగ‌డుగునా త‌మ బాధ‌లు చెప్పుకుంటూ స్వాంత‌న పొందుతున్నారు. రెండో రోజు రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి పాదయాత్ర ప్రారంభమైంది. గురువారం ఉద‌యం చినగంట్యాడ నుంచి విజయసాయి రెడ్డి సంఘీభావ యాత్ర ను ప్రారంభించారు. అడుగడుగునా ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇవాళ సీతానగర్, పెదగంట్యాడ, టీఎన్‌ఆర్‌ స్కూల్‌ మీదుగా సాగింది. గాజువాక నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి నివాసం మీదుగా.. బీసీరోడ్డు వ‌ర‌కు సాగుతుంది. త‌న‌ను క‌లిసిన ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌స్య‌లు విజ‌య‌సాయిరెడ్డి సావ‌ధానంగా వింటున్నారు. మ‌రో ఏడాది ఓపిక ప‌డితే మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పిస్తున్నారు.  వైయ‌స్ జ‌గ‌న్ సీఎం కాగానే మ‌న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అవుతాయ‌ని, రాజ‌న్న రాజ్యం జ‌గ‌న‌న్న తెస్తార‌ని హామీ ఇస్తున్నారు.

మ‌ద్ద‌తు వెల్లువ‌
విజ‌య‌సాయిరెడ్డి పాద‌యాత్ర‌కు స్థానికుల‌తో పాటు పార్టీ నేత‌లు మ‌ద్ద‌తుగా నిలిచారు. మధ్యాహ్నా విరామం అనంతరం సాయంత్రం 4 గంటలకు బీసీ రోడ్డు నుంచి సాగుతూ.. పశ్చిమ నియోజకవర్గంలోకి అడుగు పెడతారు. పశ్చిమ నియోజకవర్గంలో సాగే పాదయాత్రకు ముఖ్య అతిథిగా పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ హాజరు కానున్నారు. జింక్‌ గేట్‌ నుంచి హిమాచల్‌నగర్, గణపతి నగర్, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కాలనీ, అశోక్‌ నగర్‌ మీదుగా ఇందిరాకాలనీ, జనతాకాలనీ, హైస్కూల్‌ రోడ్డు, ఏడు గుళ్ల జంక్షన్‌ వద్దకు చేరుకుంటుంది. మల్కాపురం రెడ్డి కాలనీలో బహిరంగ సభలో విజయసాయిరెడ్డితో పాటు బొత్స సత్యనారాయణ ప్రసంగిస్తారు. అనంతరం.. ఏడు గుళ్ల జంక్షన్‌లో రాత్రి బస చేస్తారు. రెండో రోజున 51, 50, 62, 47,48 వార్డుల మీదుగా సాగనుంది.


Back to Top