హోదా ఇచ్చే వారికే మా మద్దతు

మేకపాటి రాజమోహన్‌రెడ్డి 
విజయవాడ: ఏపికి ఎవరైతే ప్రత్యేక హోదా ఇస్తారో వారికే మా మద్దతు ఉంటుందని మేకపాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని వైయస్‌ జగన్‌ నాయకత్వంలో మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి మోసం చేసిన మోడీని, చంద్రబాబును క్షమించకూడదన్నారు. మన రాష్ట్రానికి చేసిన వాగ్ధానాలన్నీ కూడా తప్పనిసరిగా నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే అన్నారు.
Back to Top