హోదాపై చంద్రబాబు రోజుకో డ్రామా

ఢిల్లీ: ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి చంద్రబాబు రోజుకో కొత్త డ్రామా మొదలు పెడుతున్నాడని వైయస్‌ఆర్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆమరణ నిరాహార దీక్షలో ఆయన మాట్లాడుతూ.. అఖిలపక్ష సమావేశం అంటూ హడావుడి చేస్తున్నారన్నారు. చంద్రబాబు నిర్వహించేంది అఖిలపక్షం కాదు.. ఏకపక్షం అన్నారు. ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. హోదాను చంద్రబాబు పట్టించుకోకపోయినా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తన పోరాటాలతో ప్రత్యేక హోదాను సజీవంగా ఉంచారన్నారు. 
Back to Top