అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వండి

ఢిల్లీ:  ప్ర‌త్యేక హోదా సాధ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ స‌మ‌ర‌శీల పోరాటం చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్రంపై ఈ నెల 16వ తేదీ అవిశ్వాస తీర్మానం పెట్టాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ సూచించ‌డంతో పార్టీ ఎంపీలు త‌మ ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు. అవిశ్వాస తీర్మానానికి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టుకునే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యారు. ఇప్పటికే వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలు బీజేడీ, టీడీపీ, టీఆర్‌ఎస్‌ మద్దతు కోరారు. 15 రోజులుగా పార్లమెంట్‌లో పోరాడుతున్నా కేంద్రం ఒక్కసారి కూడా చర్చకు అవకాశం ఇవ్వకపోవడంతో వైయ‌స్‌ఆర్‌ సీపీ వ్యూహం మార్చింది. పార్లమెంటు సమావేశాలను ముందస్తుగానే వాయిదా వేస్తారనే సమాచారంతో మార్చి 21న కాకుండా రేపు (శుక్రవారం) అవిశ్వాస తీర్మానం పెట్టాలని పార్టీ నిర్ణయించింది. అంతేకాకుండా అవిశ్వాసంపై మద్దతు కూడగట్టేందుకు టీడీపీ సహా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల మద్దతును కోరనుంది. ఈ మేరకు ఆయా పార్టీల నేతలను వైయ‌స్‌ఆర్‌ సీపీ ఎంపీలు కలుస్తున్నారు. బీజేడీ నేత భర్తృహరి మెహతాబ్‌, టీడీపీ ఎంపీ తోట నరసింహం, టీఆర్‌ఎస్‌ ఎంపీ జితేందర్‌ రెడ్డి తదితరులను కలిసిన వైయ‌స్‌ఆర్‌ సీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు పార్లమెంట్‌ సమావేశాలు నిరవధిక వాయిదా రోజే వైయ‌స్‌ఆర్‌ సీపీ ఎంపీలు రాజీనామాలు చేయనున్నారు. మరోవైపు పార్లమెంట్‌ సమావేశాలు నిరవధిక వాయిదా రోజే వైయ‌స్‌ఆర్‌ సీపీ ఎంపీలు రాజీనామాలు చేయనున్నారు.

తాజా ఫోటోలు

Back to Top