స్పీకర్‌ పోడియం వద్ద వైయస్‌ఆర్‌సీపీ సభ్యుల నిరసన

ఏపీ అసెంబ్లీ: రైతు సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించడంతో బుధవారం అసెంబ్లీలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. రెండు సార్లు సభ వాయిదా అనంతరం తిరిగి ప్రారంభం కాగా, రైతు సమస్యలపై చర్చ చేపట్టకుండా చంద్రబాబు స్టేట్‌మెంట్‌ ఇవ్వడంతో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు చేరి నిరసన చేపట్టారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యమంటూ నినాదాలు చేశారు. ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రైతు వ్యతిరేక విధానాలు నశించాలని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు.
Back to Top