పద్ధతి మార్చుకోవాలని ప్రభుత్వానికి హెచ్చరిక

హైదరాబాద్ః టీడీపీ అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్న తీరు దారుణంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జంకె వెంకట్ రెడ్డి అన్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో కాల్ మనీ సెక్స్ రాకెట్ పై చర్చ తో పాటు  రోజా సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరితే ప్రభుత్వం అందుకు తిరస్కరించడం హేయనీయమన్నారు. ప్రభుత్వం ఈరకంగా ఇష్టానుసారంగా సభను నడపడం  సిగ్గుచేటన్నారు. 

ప్రతిపక్షం లేకుండా బిల్లులు ఆమోదించడం శోచనీయమని వెంకట్ రెడ్డి మండిపడ్డారు.  ప్రతిపక్ష నేతకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా మైక్ కట్ చేయడం దుర్మార్గమన్నారు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని వెంకట్ రెడ్డి హితవు పలికారు. ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే తగిన శాస్తి తప్పదని హెచ్చరించారు. 
Back to Top