ఆసుపత్రి అభివృద్ధిని విస్మరించారు

ఏపీ అసెంబ్లీ:  పీలేరు ఆసుపత్రి అభివృద్ధిని ప్రభుత్వం విస్మరించిందని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. జీరో అవర్‌లో ఆయన ఆసుపత్రి అభివృద్ధిపై గతంలో ప్రభుత్వం ఇచ్చిన జీవోలపై మంత్రిని ప్రశ్నించారు. పీలేరులో ఎమర్జెన్సీ వార్డులేదు, ఏదైనా ప్రమాదం జరిగితే సకాలంలో వైద్యం అందడం లేదు. పీలేరులో అత్యవరసరంగా వంద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి. ఇదే విషయంపౌ మూడేళ్లుగా అడుగుతున్నా పట్టించుకోవడం లేదు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగా ఉండటం వల్లే నా నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఇచ్చిన జీవోలను అమలు చేయాలని రామచంద్రారెడ్డి కోరారు.

Back to Top