టీటీడీ నిర్ణయం రమణ దీక్షితుల ఆరోపణలకు బలం చేకూరుస్తుంది

తిరుమల: స్వామి వారి ఆలయంలో అవకతవకలు జరిగాయని టీటీడీ తీసుకున్న తాజా నిర్ణయంతో బట్టబయలైందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు.  టీటీడీ నిర్ణయం రమణ దీక్షితుల ఆరోపణలకు బలం చేకూరుస్తుందని పేర్కొన్నారు.  ఎప్పుడూ లేని విధంగా స్వామి వారి ఆలయంలోకి తొమ్మిది రోజుల పాటు భక్తులను అనుమతించమని టీటీడీ రూల్స్‌ ఎందుకు పెడుతున్నారని ఆమె ప్రశ్నించారు.  పోటులో తవ్వకాలు జరిగినప్పుడు సీసీ టీవీలు పనిచేయకపోవడంతో అందులో ఉన్న సంపదలు తవ్వి తీశారని అనుమానాలు ఎక్కువవుతున్నాయని పేర్కొన్నారు. పుట్టా సుధాకర్‌ పాలక మండలి చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి టీటీడీ చుట్టూ వివాదాలు అలుముకున్నాయని చెప్పారు. 
 
Back to Top