రాజ‌కీయ నేర‌గాడిని త‌రిమికొట్టండి..

తెలంగాణ‌లో కాంగ్రెస్ ఓట‌మికి  చంద్ర‌బాబే కార‌ణం..
వచ్చే ఎన్నికల్లో ఏపి ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలి.
వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా..
గుంటూరుః తెలంగాణాలో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోవడానికి చంద్రబాబే కారణమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. గుంటూరులో ఆమె మీడియా స‌మావేశంలో మాట్లాడారు. తెలంగాణాలో వచ్చిన ఫలితాలు చూసి ఏపి ప్రజలు సంతోషపడ్డార‌న్నారు. చంద్రబాబు రాజకీయనేరగాడ‌ని,
చేతగాని చంద్రబాబును నమ్మేస్ధితిలో ప్రజలు లేర‌న్నారు. తప్పు చేసిన వాడికి శిక్ష తప్పద‌ని, టిడిపిని తరిమికొట్టడానికి ఆంధ్రా ప్రజలు సిధ్దంగా ఉన్నార‌న్నారు. నాలుగున్నరేళ్లుగా రైతులు,నిరుద్యోగులు,డ్వాక్రామహిళలను చంద్రబాబు నిండాముంచార‌ని మండిప‌డ్డారు. లగడపాటితో సర్వే పేరుతో చంద్రబాబు కుట్రలు చేసి డబ్బుకట్టలతో గెలవాలనుకున్నార‌న్నారు. ఎన్నికలకు ముందు ప్రజలను తికమకపెట్టడానికి లగడపాటిని తెర‌పైకి తీసుకువ‌చ్చార‌న్నారు. చంద్ర‌బాబు చేసిన నీతిమాలిన రాజకీయాలకు బుద్ది చెప్పడానికి తెలంగాణా ప్రజలు కంకణం కట్టుకున్నార‌ని, తెలంగాణ ప్ర‌జ‌లు ఇచ్చిన తీర్పు ద్వారా నిరూపిత‌మైంద‌న్నారు. విజయమాల్యా, .సుజనాచౌదరి లాగా లగడపాటి కాంగ్రెస్, టిడిపిలను గెలిపించేసి  ఏదోవిధంగా అప్పులు ఎగ్గొట్టాల‌నే ప్ర‌య‌త్నాలు చేశార‌న్నారు.లగడపాటి మాటలు చూస్తే రాజకీయబ్రోకర్ లాగా ఉన్నాయ‌ని, రాజకీయసన్యాసం చేసిన లగడపాటి సర్వేల సన్యాసం కూడా  చేస్తే బాగుంటుంద‌న్నారు. తమిళనాడు, తెలంగాణాలో లగడపాటి సర్వేల గురించి ఛూశామ‌ని, ఆంధ్రలో ఆయన సర్వేలను పట్టించుకునే పరిస్దితి లేద‌న్నారు. కాంగ్రెస్ తో కలిస్తే బట్టలూడదీసి కొడతారని మంత్రి అయ్యన్నపాత్రుడు చెప్పార‌ని, ప్రజలు నేడు అది  నిజంచేశార‌న్నారు. టిడిపి -కాంగ్రెస్ తో కలిస్తే ఉరేసుకుంటానని కేఇ కృష్ణమూర్తి అన్నారు. కాంగ్రెస్ను టిడిపిని తెలంగాణ ప్రజలు ఉరేశారో చూశామ‌న్నారు. పప్పు చాలా హ్యాపిగా ఉంటాడ‌ని, నేను తెలంగాణాకు వెళ్లినప్పుడే ఒకటన్నా వచ్చింది. చంద్రబాబు వెళ్లి నిండాముంచారనే ఆనందంతో ఉండి ఉంటాడు అని ఛ‌లోక్తులు విసిరారు. చంద్రబాబును పప్పును ఇక ఓఎల్ ఎక్స్ లో పెట్టి అమ్మాల్సిందే అని చుర‌క‌లు వేశారు. నందమూరి ఫ్యామిలిని సమాధి చేయాలన్న కుట్రకు తెరలేపి నందమూరి సుహాసిని ఎన్నికలకు తీసుకువచ్చి  బలి చేశార‌న్నారు. చంద్రబాబు కుట్రను జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ లు గుర్తించార‌న్నారు. తెలుగుదేశాన్ని నీవు కాపాడలేకపోతున్నావు ఇక దేశాన్ని ఏం కాపాడతావని చంద్రబాబుకు తెలంగాణా ప్రజలు బుధ్ది చెప్పార‌న్నారు.
-కూకట్ పల్లి,మల్కాజ్ గిరి,శేర్ లింగంపల్లిలలో ఆంధ్రావాళ్లు ఎక్కువ ఉంటారు.అక్కడి ప్రజలు చంద్రబాబు అవినీతి, దోపిడిని గురించి వినేవారు ఇంత చిత్తుగా  ఓడించారు. చంద్రబాబు అరాచకాలను కళ్లారా చూసిన ఆంధ్రా ప్రజలు అవకాశం వస్తే  తరిమికొడతానికి సిధ్దంగా ఉన్నారు.40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబును తెలంగాణా ప్రజలు 40 అడుగుల గోతి తీసి పాతిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో ఏపి ప్రజలు విజ్ఞతతో వ్యవహరించాలన్నారు.తాజా వీడియోలు

Back to Top