చంద్రబాబుది ఐరన్‌ లెగ్‌



– వైయస్‌ జగన్‌ను ఎదుర్కునే దమ్ము లేక హత్యాయత్నం 
– వైయస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో చంద్రబాబు ఏ1 ముద్దాయి
– కేసును నీరుగార్చేందుకు విశ్వ ప్రయత్నాలు
– టీడీపీ తెలుగు దొంగల, ద్రోహుల పార్టీగా మారిపోయింది
– వైయస్‌ జగన్‌ ప్రజాదరణ చూసి ఓర్వలేక కుట్రలు
– కులాల పేరు చెప్పి ఓట్లు అడగవద్దని బాబు చెప్తున్నారు
– టీడీపీ మేనిఫెస్టో అంతా కులాల కంపే
– నాయకుడికి కులమెందుకు..గుణం ఉంటే చాలు
– బాబు మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంది

హైదరాబాద్‌: జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుది ఐరన్‌ లెగ్‌ అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నవాళ్లు ఎవరూ కూడా బాగుపడలేదని, ఆయనతో పొత్తు పెట్టుకున్న గుజ్రాలు, వాజ్‌పేయి రిటైరయ్యారని తెలిపారు. పాపం ఇప్పుడు రాహుల్‌తో పొత్తు పెట్టుకున్నారని, చిన్న వయస్సులోనే రాహుల్‌ రిటైరయ్యేటట్టు ఉన్నారని అనుమానం వ్యక్తం చేశారు.  టీడీపీని తెలుగు దాల్‌ పప్పుగా మార్చేశారని విమర్శించారు. వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై టీడీపీ నేతల తీరు బాధాకరమని, థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించాలని ఆమె డిమాండు చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు.   వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాఉద్దాంతాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారని విమర్శించారు. వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో ఏ1 ముద్దాయి చంద్రబాబే అన్నారు. నాడు ఎన్‌టీ రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీని నేడు చంద్రబాబు తెలుగు దొంగల పార్టీగా మార్చారని విమర్శించారు. తెలుగు ద్రోహుల పార్టీగా మార్చి, వైయస్‌ జగన్‌ను ఎదుర్కొనే దమ్ము, «ధైర్యం లేక, ఆయన ఎలా తప్పించుకున్నారని చంద్రబాబు ప్రెస్టేషన్‌లో అవహేళనగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైయస్‌ జగన్‌ ఈ రోజు మామూలు వ్యక్తి కాదని, వైయస్‌ రాజశేఖరరెడ్డి తరువాత మళ్లీ తమను కష్టాల నుంచి బయటపడేసే వ్యక్తి అని రాష్ట్ర ప్రజలు అభిమానిస్తున్నారన్నారు. చంద్రబాబు ఈ రోజు పోలీసులను మేనేజ్‌ చేశారని, ఘటన జరిగిన వెంటనే డీజీపీతో ప్రెస్‌మీట్‌ పెట్టించి తప్పుడు ఆరోపణలు చేశారన్నారు. మీడియాను మేనేజ్‌ చేశారని, అది కత్తి కాదు..కేవలం అలా గుచ్చారని, వైయస్‌ జగన్‌ ఎయిర్‌ పోర్టు నుంచి నేరుగా ఇంటికి వెళ్లారని తప్పుడు కథనాలు రాయించారన్నారు. చంద్రబాబు నిజంగా అన్నం తింటుంటే వైయస్‌ జగన్‌ నేరుగా ఇంటికి వెళ్లారని నిరూపించాలని సవాలు విసిరారు. ఒక ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే దానిపై విచారణ చేయిస్తామని అధికారంలో ఉన్న నాయకులు పేర్కొంటారన్నారు. కానీ చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరిగి ఆయా పార్టీల నాయకుల కాళ్లు పట్టుకొని మేనేజ్‌ చేసుకుంటున్నారని విమర్శించారు. నిందితుడు శ్రీనివాస్‌ కాల్‌ డేటా, క్యాంటీన్‌ ఓనర్‌ను ఎందుకు విచారించడం లేదని, వైయస్‌ జగన్‌కు బయట నుంచి కాఫీలు, టిఫిన్లు రాకుడదని ఎందుకు ఆంక్షలు విధించారని ప్రశ్నించారు. శ్రీనివాస్‌ అన్నను మీడియా ముందుకు తెచ్చి వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలమని చెప్పించడం సిగ్గు చేటు అన్నారు. చంద్రబాబును కాపాడేందుకు ఆయన సామాజిక మాధ్యమాలు ఎందకు ఇంతగా దిగజారిపోతున్నాయని ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ ఉంటే ఎవరికి నష్టం, లేకుంటే ఎవరికి నష్టమని నిలదీశారు. అన్ని సర్వేలు కూడా వైయస్‌ జగన్‌ సీఎం కాబోతున్నారని, ఈ నిజాన్ని తట్టుకోలేక అడ్డుతొలగించుకునేందుకు కోతిగా కుప్పిగంతులు వేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు సిగ్గుపడాలని, ప్రతిపక్ష నాయకుడికి భద్రత కల్పించలేకపోయారన్నారు. తన సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోలేని వ్యక్తి వెటకారంగా మాట్లాడటం సిగ్గు చేటు అన్నారు. ఎన్నికల్లో గెలవలేని వ్యక్తి లోకేష్‌ కూడా వైయస్‌ జగన్‌ గురించి అవహేళనగా మాట్లాడటం బాధాకరమన్నారు. చంద్రబాబు, లోకేష్‌ శునకానందం పొందుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి ఒక్కరు వైయస్‌ జగన్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నారని, వారిలో విలువలు, మానవత్వం ఉందికాబట్టి ఇలా చేస్తున్నారని, చంద్రబాబుకు విలువలు లేవు కాబట్టే వెటకారంగా మాట్లాడుతున్నారన్నారు. ఆ రోజు ఎన్‌టీఆర్‌ను పదవి నుంచి దించి ఆయన చావుకు చంద్రబాబు కారణమయ్యారన్నారు. ఇవాళ వైయస్‌ జగన్‌ సుడిగాలిలా ప్రజాభిమానంతో పైకి వస్తుంటే చూసి తట్టుకోలేక ఆయనను అడ్డు తొలగించుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంతో ప్రమేయం లేని ఒక కేంద్ర స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని డిమాండు చేశారు. దీని వెనుక ఉన్న నిందితులందరూ కూడా బయటకు రావాలని కోరారు. 

మాది కోడి కత్తి పార్టీ అని చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన ప్రభుత్వంలో, తన ఇంటలీజెన్సీ వైఫల్యం కారణంగా అలిపిరిలో చంద్రబాబుపై దాడి జరిగితే దాన్ని సానుభూతిగా మార్చుకొని  ఎన్నికలకు వెళ్లాలనే దుర్మార్గుడన్నారు. ఇదే వైజాగ్‌లో చంద్రబాబుపై ఈ ఘటన జరిగి ఉంటే ఆయన ఓవరాక్షన్‌ ఎలా ఉండేదో ఊహించడమే కష్టమన్నారు. వైయస్‌ జగన్‌  ఒక బాధ్యత గలిగిన పౌరుడిలా డిగ్నిఫైడ్‌గా ఆయామ్‌ సేఫ్‌ అంటూ బాధను, గాయాన్ని భరిస్తూనే విశాఖ నుంచి హైదరాబాద్‌కు వచ్చారన్నారు. చేతికైన గాయంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంటే నాలుగు రోజులకే కడపలో ధర్మ పోరాటం పెట్టి ఎలా మాట్లాడారో అందరం చూశామన్నారు. ఇవాళ జేసీ దివాకర్‌రెడ్డి నీచంగా మాట్లాడుతున్నారని, వైయస్‌ జగన్‌ రెడ్డి కాదు అంటూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. నాయకుడికి కులమెందుకు, గుణం ఉంటే చాలు అన్నారు. జేసీ, ఆదినారాయణరెడ్డి, సోమిరెడ్డితో వైయస్‌ జగన్‌ను తిట్టించి, నిన్న ప్రకాశం జిల్లాలే చంద్రబాబు కులాల పేరు చెప్పి ఓట్లు అడగకూడదని పేర్కొనడం దయ్యాలు వేదాలు వళ్లించినట్లుగా ఉందన్నారు. చంద్రబాబు మేనిఫెస్టోలో మొత్తం కులాల కంపే ఉందన్నారు. కులాల వారిగా మనుషులను విడదీసి చిచ్చుపెడుతున్నారన్నారు. ఈ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పోరాటం చేస్తే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నట్లు అరెస్టు చేయించారని, చంద్రబాబు చేతకాని తనం కారణంగా కేంద్రం నుంచి రావాల్సిన  నిధులు రాకపోతే ధర్మపోరాట దీక్షలు చేస్తూ ఇతరులపై నెపం నెట్టుతున్నారన్నారు. చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న వారు బాగుపడిన  చరిత్ర లేదన్నారు. ఆయన పొత్తు పెట్టుకున్న వారంతా రిటైర్డు అయ్యారని, దేవగౌడ, వాజ్‌పేయి రిటైర్డు అయ్యారని, పాపం చిన్న వయసులో ఉన్న రాహుల్‌ గాంధీతో ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారని, ఆయన కూడా రిటైర్డు అయ్యే సమయం దగ్గర్లోనే ఉందన్నారు. జాతీయ రాజకీయాల్లో చంద్రబాబుది ఐరన్‌ లెగ్‌ అని అభివర్ణించారు. వైయస్‌ జగన్‌పై జరిగిన ఘటనపై స్వతంత్ర సంస్థతో విచారణ చేయించండి అంటే ఎందుకు చంద్రబాబు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. ఒకవైపు డీజీపీ, మరో వైపు సిట్‌ అధికారులను పెట్టుకుని  ఇదంతా ఆపరేషన్‌ గరుడా అంటూ, వైయస్‌ జగన్‌ కేంద్రంతో కలిసి ఇలాంటివి చేయించుకున్నారని చెప్పడం సిగ్గు చేటు అన్నారు. సినిమా ఆర్టిస్టుతో గరుడా ఆపరేషన్‌ అంటూ చెప్పించి, అందులోనివి జరుగుతుంటే మీ ఇంటలీజెన్స్‌ ఏం చేస్తుందని ప్రశ్నించారు. డీజీపీని తొలగించి శివాజీని నియమించవచ్చు కదా అని నిలదీశారు. ఆపరేషన్‌ గరుడాపై విచారణ చేయాలని ఎందుకు ఢిల్లీలో డిమాండు చేయలేదన్నారు. ఇదంతా చేయిస్తుంది చంద్రబాబు, లోకేష్‌ మాత్రమే అని స్పష్టం చేశారు. ఇంకా ఎన్ని ఎత్తులు, వినాశనాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారో అని అనుమానం వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ గుంటూరు వస్తే..ఆయనపై చెప్పులు వేయించిన చంద్రబాబు ఆయనతో పొత్తులు ఎందుకు వేస్తున్నారని విమర్శించారు. వైయస్‌ జగన్‌ కాంగ్రెస్‌ నుంచి బయటి వచ్చాక ఎన్ని కుట్రలు చేశారో ప్రజలందరికీ తెలుసు అన్నారు. టీడీపీ నేతలు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైందని, చంద్రబాబు చొక్కాలు పట్టుకొని నిలదీయాలని పిలుపునిచ్చారు. నలుభై ఏళ్ల పాటు పోరాటం చేస్తున్న టీడీపీ ఇవాళ కాం్రVð స్‌తో ఎలా పొత్తు పెట్టుకుంటావని ప్రశ్నించాలన్నారు. కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు ఇవాళ ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆ రోజు ఎన్టీఆర్‌కు వెన్నుపొటు పొడిచి టీడీపీని లాక్కున్నారని, ఇవాళ కాంగ్రెస్‌తో కలిసి మళ్లీ ఎన్‌టీఆర్‌ను మరోమారు చంపారనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు. చంద్రబాబు టీడీపీని కాంగ్రెస్‌తో కలిపినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. తన అధికార దాహం కోసం దేనికైనా చంద్రబాబు వెనుకాడడని చెప్పారు. సొంత పిల్లనిచ్చిన మామే చంద్రబాబు గాడ్సే కంటే హీనమని పేర్కొన్నట్లు గుర్తు చేశారు. చంద్రబాబు అనే వ్యక్తి తనకు ఎదురు వచ్చిన ఎవరైనా లేపేస్తారని విమర్శించారు. పొత్తులు లేకుండా చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేదన్నారు. తన పరిపాలనపై నమ్మకం లేక కాంగ్రెస్‌తో జత కట్టారని విమర్శించారు. రాహుల్‌ గాంధీని చూపించి ఓట్లు అడుక్కునేందుకు సిద్ధమయ్యారని వ్యాఖ్యానించారు. టీడీపీది పిల్ల కాంగ్రెస్‌ అని విమర్శించారు. రాష్ట్ర విభజన చట్టంలోని ఏ ఒక్కటి తీసుకురాలేని చేతకాని దద్దమ్మలు టీడీపీ నేతలు అన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రానికి మంచి జరుగదని, వెంటనే ఆయన్ను పిచ్చి ఆసుపత్రిలో చేర్పించి చికిత్సలు అందించాలని సలహా ఇచ్చారు. చంద్రబాబు ప్లాన్‌ 1, ప్లాన్‌ 2 విఫలమయ్యాయని, ఇప్పటికైనా వైయస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనపై థర్డ్‌ పార్టీతో దర్యాప్తు చేపట్టాలని డిమాండు చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top