వైయస్‌ఆర్‌ది మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిత్వంఅమెరికా: మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిత్వంతో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి జనం మదిలో శాశ్వతంగా నిలిచిపోయారని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అమెరికాలో నిర్వహించిన వైయస్‌ఆర్‌ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే మాట్లాడారు. దీర్ఘకాలం ప్రజలకు మేలు చేసేలా వైయస్‌ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారన్నారు. వైయస్‌ఆర్‌ పాదయాత్ర ద్వారా అన్ని రకాల సమస్యలు తెలుసుకుని, అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ సమస్యలు పరిష్కరించారన్నారు. ప్రతి ఇంటిలో ఆయన ఫోటో పెట్టుకునే విధంగా పరిపాలించారన్నారు. మహానేత లేని లోటు ప్రతి ఒక్కరిలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రజల మధ్య నుంచి నడిచొచ్చిన నాయకుడు వైయస్‌ఆర్‌ అన్నారు. వైయస్‌ జగన్‌ ద్వారా రాజన్న వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
 
Back to Top