పోలీసుల అత్యుత్సాహం

- కావ‌లిలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి హౌస్‌ అరెస్ట్‌
- క‌దిరిలో సిద్దారెడ్డి ఏర్పాటు చేసిన వేదిక ధ్వంసం 
 నెల్లూరు : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అధికార పార్టీ నేత‌లు పోలీసుల‌ను అడ్డుపెట్టుకొని ఉద్య‌మాల‌ను అణ‌చివేయాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాటం చేస్తున్న వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించి వేధింపుల‌కు గురి చేస్తున్నారు. తాజాగా వైయ‌స్ఆర్‌ సీపీ నేత, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌ రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. సోమవారం అల్లూరు మండలం ఇసుకపల్లెలో ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి పర్యటించకుండా పోలీసులు అడ్డుకున్నారు. మత్స్యకార గ్రామాలకు వెళ్లకుండా ఆయనను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఆయన నివాసం ముందు భారీగా భద్రతా దళాలు, పోలీసులు మోహరించారు. ప్రతాప్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధిని పర్యటించకుండా అడ్డుకోవటం దారుణమన్నారు. పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే
వైయ‌స్ఆర్‌సీపీ నేత డాక్ట‌ర్ సిద్ధారెడ్డి క‌దిరి ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన వేదిక‌ను పోలీసులు బ‌ల‌వంతంగా తొల‌గించారు. పోలీసుల తీరుపై వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు.

 

Back to Top