పోర్టు సాధనకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం


నెల్లూరు: రామాయ్యపట్నం పోర్టు నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ వైయస్‌ఆర్‌ సీపీ ఆందోళనకు దిగింది. కావలిలో పోర్టు సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ఒక్కరోజు నిరాహారదీక్షలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామాయపట్నం  పోర్టు వస్తే నెల్లూరు, ప్రకాశం జిల్లాలు అభివృద్ధి చెందడమే కాకుండా యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. పోర్టు సాధన కోసం ఎన్ని పోరాటాలకైనా సిద్ధమన్నారు. గతంలో కూడా పోర్టు కోసం పాదయాత్రలు చేశామన్నారు. దుగ్గిరాజపట్నం పోర్టును కేంద్రం నిరాకరించడంతో ఆ స్థానంలో రామాయ్యపట్నం చేపట్టాలని డిమాండ్‌ చేశారు. 
 
Back to Top