<strong>వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర</strong>విజయనగరంః గిరిజన చట్టాలకు తెలుగుదేశం ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర మండిపడ్డారు. చట్టాలకు విరుద్దంగా గిరిజన ప్రాంతంలో గనులు,ఖనిజాలు దోచుకుపోతున్నారని విమర్శించారు.టీడీపీ పాలనలో లంచమిస్తేనే ఉద్యోగాలని,టైకార్ రుణాలను బోగస్ గిరిజనులకు మంజూరు చేస్తున్నారు. అర్హులకు అందడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలకే లబ్ధి చేకూరుస్తున్నారని తెలిపారు. గిరిజన కార్పొరేషన్ పరిస్థితి దారుణంగా ఉందని కనీసం చింతపండు కూడా కొనడంలేదన్నారు. గిరిజన కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసి మూతవేసే ఆలోచనలో టీడీపీ ప్రభుత్వం ఉందన్నారు ఐటిడిఏలో కూడా అవినీతి జరుగుతుందన్నారు.కనీసం ప్రతిప„ý ఎమ్మెల్యేలకు తెలియజేయకుండా అధికారులు, అధికార ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. చంద్రబాబునాయుడు పాలనలో మోసపూరితమని, దగా పాలన సాగుతుందన్నారు.గిరిజనులంతా జగన్‌మోహన్ రెడ్డికి అండగా ఉండాలని ఆయనను సీఎం చేసే సమయం ఆసన్నమయ్యిందన్నారు.<br/>