బాబూ..బ్రాహ్మణులతో పెట్టుకుంటున్నావ్‌ జాగ్రత్త

– ఆస్తుల లెక్కులు భక్తులకు చెప్పమని కోరడం తప్పా
–  రమణ దీక్షీతులు లేవనెత్తిన అంశాలపై సీబీఐ విచారణ జరిపించాలి
విజయవాడ:  చంద్రబాబు బ్రాహ్మణులతో పెట్టుకుంటున్నావ్  జాగ్రత్త అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోన రఘుపతి హెచ్చరించారు. గతంలో ఐవైఆర్‌ కృష్ణారావును అలానే అవమానించారని, ఇప్పుడు రమణ దీక్షీతులను అవమానించారని వ్యాఖ్యానించారు.  సన్నిది గొల్లలకు కూడా చంద్రబాబు అన్యాయం చేశారని విమర్శించారు. తక్షణమే రిటైర్డ్‌మెంట్‌ నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్‌ చేశారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఆలయాలన్నింటికీ ధూపదీప నైవేద్యాలకు నిధులిచ్చి ఆదుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనలో ఆలయాలకు రక్షణ కరువైందన్నారు.  ఆస్తుల లెక్కలు భక్తులకు చెప్పమని కోరడం తప్పా అని ఎమ్మెల్యే కోన రఘుపతి ప్రశ్నించారు. తిరుమలలో జరుగుతున్న తప్పుల వల్ల రాష్ట్రానికే అరిష్టమన్నారు. 65 ఏళ్లకు రమణ దీక్షితులను పక్కన పెట్టడం దురదృష్టకరమన్నారు. తన బాధలు చెప్పుకోవడానికి కూడా ఇక్కడ అవకాశం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. రమణ దీక్షితులు పక్క రాష్ట్రానికి వెళ్లి చెప్పే పరిస్థితి కల్పించారని, దేవాలయాలను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు విజయవాడలో కూల్చిన ఆలయాలను ఎక్కడా తిరిగి నిర్మించలేదన్నారు. సేవల సమయాలను ఇష్టానుసారంగా మార్చేయడం దారుణమని మండిపడ్డారు. శాస్త్ర విరుద్ధంగా చేస్తున్నారని, మిరాశీ కుటుంబీకుడు ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు. ఆస్తుల లెక్కులు భక్తులకు చెప్పమని కోరడం తప్పా అని ప్రశ్నించారు. వంటసాలను 2017 డిసెంబర్‌లో మూసివేసి తవ్వకాలు జరపడం వెనుక ఆంతర్యం ఏంటో అని ప్రశ్నించారు. కోర్టు తీర్పును కూడా కాదని మిరాశీలను 65 ఏళ్లకు తొలగిస్తామనడమేంటో అని మండిపడ్డారు. స్వామి వారి నగలలోని వజ్రంపై విచారణ జరపాలని ఆయన కోరారు. దీక్షీతులు లేవనెత్తిన అంశాలపై సీబీఐ విచారణ జరిపించాలని రఘుపతి డిమాండు చేశారు. రమణ దీక్షితులను తక్షణమే ప్రధాన అర్చకుడిగా నియమించాలని ఆయన కోరారు. 
 
Back to Top