రాజకీయ కక్షసాధింపులకు సహకరిస్తే సహించేది లేదు


కృష్ణా  జిల్లా: రాజకీయ కక్షసాధింపులకు అధికారులు సహకరిస్తే సహించేది లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. సోమవారం కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ నేతలు కక్షసాధింపు చర్యలకు దిగారు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా నిలిచిన కౌన్సిలర్‌పై తప్పుడు కేసులు బనాయించారు. కిరాణా షాపులో మద్యం బాటిళ్లు ఉన్నాయని హడావుడి చేసి, కౌన్సిలర్‌ సోదరిని విచారణ పేరుతో ఎక్సైజ్‌ కార్యాలయానికి తరలించారు. విషయం తెలుసుకున్న వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే కోడాలి నాని ఎక్సైజ్‌ కార్యాలయానికి చేరుకొని మద్యం బాటిళ్ల లేబుళ్లు పరిశీలించారు. టీడీపీ మున్సిపల్‌ చైర్మన్‌ యలపర్తి బంధువు దుకాణంలో మద్యంగా గుర్తించారు.  కేవలం విచారణ కోసమే తీసుకొచ్చామని ఎక్సైజ్‌ అధికారులు వివరణ ఇచ్చారు. 
 
Back to Top