దోపిడీ డబ్బును కక్కించండి

మాజీ సీఎస్‌ వ్యాఖ్యలను న్యాయస్థానం సుమోటోగా తీసుకోవాలి
చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విచారణకు సిద్ధపడాలి
మూడు విషయాలపై సీబీఐ ఎంక్వైరీ వేసిన నాయకుడు వైయస్‌ఆర్‌
అవినీతి బయటపడుతుందని సీబీఐని రాకుండా చేసిన ఘనుడు బాబు
చంద్రబాబు అవినీతి ఏ విధంగా ఉందో ప్రజలంతా ఆలోచించాలి
2014లో జోలి పట్టిన సోమిరెడ్డి ప్రస్తుతం ఓటుకు రూ. 5 వేలు ఇస్తాడట
అజయ్‌ కల్లం వ్యాఖ్యలపై సోమిరెడ్డి మాట్లాడడం విడ్డూరం
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి
నెల్లూరు: మాజీ సీఎస్‌ల వ్యాఖ్యలను న్యాయస్థానం సుమోటోగా స్వీకరించి అవినీతి సొమ్మును చంద్రబాబు, లోకేష్‌ దగ్గర నుంచి కక్కించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోరారు. ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పేరుతో చంద్రబాబు ఏ విధంగా దోచుకుంటున్నారో మాజీ చీఫ్‌ సెక్రటరీ అజయ్‌ కల్లం చెప్పారన్నారు. అదే విధంగా రాజధాని భూముల కుంభకోణంపై మరో మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణారావు స్పష్టంగా చెప్పారన్నారు. చంద్రబాబు దమ్మూ, ధైర్యం ఉంటే అజయ్‌ కల్లం, ఐవైఆర్‌ల ఆరోపణలపై జ్యుడీషియల్‌ ఎంక్వైరీకైనా, సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌తోనైనా విచారణకు సిద్ధపడాలని డిమాండ్‌ చేశారు. నెల్లూరు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో పనిచేసిన ఒక్క అధికారి అయినా బయటకు వచ్చి రాష్ట్రంలో అవినీతి జరిగిందని చెప్పిన సందర్భాలు ఉన్నాయా.. అని అడిగారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు మూడు విషయాలపై ఆరోపణలు చేస్తే సీబీఐ ఎంక్వైరీ వేసిన ముఖ్యమంత్రి వైయస్‌ఆర్‌ అని గుర్తు చేశారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డు, వోక్స్‌ వ్యాగెన్, పరిటాల రవి హత్య కేసులో బాబు ఆరోపణలు చేస్తే సీబీఐ ఎంక్వైరీ వేశారన్నారు. 

రాష్ట్రంలో అవినీతి ఏ విధంగా జరుగుతుందో మాపీ సీఎస్‌ల మాటలే నిదర్శనమన్నారు. లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అజయ్‌ కల్లం ఆరోపణలు చేస్తే ఎక్కడ తన బండారం బయటపడుతుందోనని, అవినీతి బయటకు వస్తే చంద్రబాబు, ఆయన కొడుకు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆంధ్రరాష్ట్రంలో సీబీఐ జోక్యం చేసుకునే హక్కు లేదని దొంగ చాటుగా జీఓ జారీ చేశారని మండిపడ్డారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై గతంలో సీబీఐ దాడులు చేసినప్పుడు విచారణ న్యాయబద్ధం చేస్తుందని ఎగిరి ఎగిరి మాట్లాడిన చంద్రబాబు రాష్ట్రంలో సీబీఐ జోక్యాన్ని నివారించే విధంగా జీఓలు తెచ్చారంటే ఏ విధంగా రాష్ట్రాన్ని లూటీ చేశారో ప్రజలంతా ఆలోచించాలన్నారు. 

అజయ్‌ కల్లం చేసిన వ్యాఖ్యలపై సోమిరెడ్డి లాంటి వ్యక్తి సమాధానం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సోమిరెడ్డి తన స్థాయి ఏంటో తెలుసుకొని మాట్లాడాలని కాకాణి సూచించారు. చంద్రబాబు వివరణ ఇవ్వాల్సిన అంశాలపై చంద్రబాబు మొరిగితే అర్థం ఏముందన్నారు. అజయ్‌ కల్లం రెడ్డి అని ఒత్తి ఒత్తి అని చంద్రబాబు బూట్లు కానే సోమిరెడ్డి చేత మొరిగిస్తున్నారన్నారు. ఐవైఆర్‌ కృష్ణారావు రాజధాని భూముల్లో కుంభకోణం జరిగిందని, అజయ్‌ కల్లం ఇరిగేషన్, ఫాంపాండ్స్‌లలో అవినీతి జరిగిందని ఆరోపణలు చేశారని, చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే విచారణకు సిద్ధపడాలని డిమాండ్‌ చేశారు. కాళ్లు ఒత్తి, బూట్లు నాకే వ్యక్తితో ఖండన ఇప్పించి విషయాన్ని తప్పుదోవపట్టించాలనుకోవడం మంచి పద్ధతి కాదన్నారు. విజన్‌ 2020, విజన్‌ 2050 అని చంద్రబాబు, లోకేష్‌ మాట్లాడుతున్నారని, విజన్‌ 2020కి వచ్చే సరికి 40 శాతానికి చేరారని, 2050 వచ్చే సరికి టీడీపీ అవినీతి 100 శాతానికి చేరుతుందన్నారు. 

అవినీతి నిర్మూలన అంటూ నిత్యం ప్రవచనాలు చేసే పవన్‌ కల్యాణ్‌ మాజీ సీఎస్‌ల వ్యాఖ్యలపై మాట్లాడేందుకు ఎందుకు భయపడుతున్నారని కాకాణి ప్రశ్నించారు. నాలుగున్నర సంవత్సరాలు చంద్రబాబుతో అంటకాగి అవినీతి డబ్బును పంచుకొని, లింగమనేని రమేష్‌ దగ్గర రూ. 4 కోట్లు విలువ చేసే రెండుకరాల భూమిని రూ. 20 లక్షలకు పవన్‌ కల్యాణ్‌ కొట్టేశారన్నారు. అలాంటి వ్యక్తికి అవినీతి నిర్మూలన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. దేశంలో ఉండే అవినీతి పరులంతా చివరకు కాంగ్రెస్‌తో చేరుతారని 2013లో చంద్రబాబు మాట్లాడారని, అన్నట్లుగానే కాంగ్రెస్‌తో కలిశాడన్నారు. అందుకే కాంగ్రెస్‌ కూడా బాబు అవినీతిపై నోరు విప్పడం లేదన్నారు. 
 
నెల్లూరు జిల్లా స్థాయిలోనే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి రూ. 500 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని కాకాణి గోవర్ధన్‌రెడ్డి చెప్పారు. కనీసం గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా అనుభవం లేని వ్యక్తికి పంచాయతీ రాజ్‌ శాఖ, నాలుగుసార్లు ప్రజలు తరికికొట్టిన వ్యక్తికి ఇరిగేషన్‌ శాఖ అప్పగించారని అజయ్‌ కల్లం చెప్పారన్నారు. 2014 ఎన్నికల్లో ఆర్థిక స్థోమత లేదని విరాళాలు కోసం జోలి పట్టిన సోమిరెడ్డి, ఇప్పుడు ఓటుకు రూ. 5 వేలు పంచడానికి సిద్ధంగా ఉన్నాడన్నారు. నాలుగున్నరేళ్లలో ఏ విధంగా అవినీతికి పాల్పడ్డాడో ప్రజలు ఆలోచించాలన్నారు. సోమిరెడ్డికి కలెక్టీవ్‌ రెస్సాన్స్‌బులిటీ లేదు కానీ కలెక్షన్‌ రెస్పాన్స్‌బులిటీ ఉందన్నారు. రైస్‌ మిల్లర్ల దగ్గర రూ. 50 కోట్లు, పసుపు కుంభకోణంలో కోట్ల రూపాయల అవినీతి, నీరు చెట్టు, ఇరిగేషన్‌ దొంగ బిల్లులు, ట్రాక్టర్ల పంపిణీలో అడ్డగొలుగా దోచుకున్నాడని మండిపడ్డారు. అవినీతిపై అజయ్‌ కల్లం చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని రాష్ట్ర సంపదను దోచుకున్న  చంద్రబాబు, లోకేష్‌ నుంచి డబ్బు కక్కించాలని కోరారు. 

తాజా వీడియోలు

Back to Top